గుజరాత్‌లో 10 ఏళ్ల బాలిక ఇన్స్టాగ్రామ్ పరిచయంతో పక్క ఊరి 16 ఏళ్ల బాలుడితో వెళ్లిపోయింది. ఐదో తరగతి చదువుతున్న ఈ బాలిక డిసెంబర్ 31న ఇంటి నుంచి గల్లంతైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి బాలికను కనుగొని ఇంటికి తీసుకెళ్లారు. తల్లి ఫోన్‌లో ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉండగా బాలుడితో పరిచయం ఏర్పడి, స్నేహితుల సహాయంతో అతడితో వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. పిల్లలు ఫోన్‌లో ఏమి వాడుతున్నారా… అనే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

