ఎండా కాలం ఒచ్చిందంటే సాలు.. సల్లదనమిచ్చే కూలర్లు, ఏసీలకు పరుగులు పెడ్తం కనీ, గా ఇంటినే సల్ల సల్లగుండేటట్లు కట్టకుందామని అనుకోం. ఇగిప్పుడైతే టాపులపై కూల్ పెయింట్లు, సీలింగ్ అసొంటియే శేత్తానం. కనీ, ఎన్కటి లెక్క ఆలోశిత్తలేం. కనీ ఇల్లు సల్లసల్లగ ఉండెటానికి ఒకాయినె ఏం శేసిండో సూద్దామా?

వెదురు బొంగులు తీసుకున్నడు. మంచిగ గవాటితోటి ఎన్కటి లెక్క పై కప్పేసిండు. మల్ల గదానికి లోపల మంచి డిజైన్లు ఏపిచ్చిండు. పైన తడవకుండ రూఫ్ టాప్ రేకులు ఏసిండు. శినుకు పడదు. ఎండ తాకదు. ఏడి కొట్టదు. అందానికి అందం. ఏ పీఓపీలు, సీలింగులు గిదీని ముందు నిలుస్తయి శెప్పుండ్రి.?

