Monday, August 3, 2026
31.5 C
Hyderabad

తెలంగాణ మగువల పూల జాతర!|EDITORIAL

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులన్నీ నిండి కళకళలాడుతున్నాయి. పచ్చటి పంటపొలాలతో అలరారుతున్నాయి. అలాగే తంగేడు, గునుగు, గడ్డిపూలు వివరివిగా దొరకుతుండటంతో బతుకమ్మ సంబురాలు ఊరూవాడా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తోంది.

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దశదిశలా చాటి చెప్పే పండుగ ’బతుకమ్మ’. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులనే పూజించే సంస్కృతి ఒక తెలంగాణలోనే కనబడుతుంది. ముఖ్యం గా స్త్రీలకు అత్యంత ఇష్టమైన పండుగ గా ప్రసిద్ధికెక్కింది. తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పే పండుగ మాత్రమే కాదు, స్త్రీల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటే పండుగ. ఆడపడుచులందరికీ అత్యంత విశిష్టమైన పండుగ ఇది.
పూల జాతరను తలపించే, బతుకమ్మ పండుగ ప్రతి ఏటా సెప్టెంబర్‌/అక్టోబర్‌ నెలల్లో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి మొదలవుతుంది. దీనిని 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మను గౌరీ పండుగ అని కూడా అంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, సద్దుల బతుకమ్మ వరకు రోజుకో తీరుగా ఆడి పాడే పండుగ. ఆ మరుసటి రోజే దసరా పండుగ వైభవంగా జరుపుకుంటారు. మహాలయ అమావాస్యతో ప్రారంభమై, దుర్గాష్టమితో ముగుస్తుంది. బతుకమ్మ పండుగంటే, ఆడబిడ్డల హృదయాలు ఉప్పొంగుతాయి. అన్నా చెల్లెల అనుబంధాలు, తల్లి బిడ్డల ప్రేమానుబంధాలు వెల్లివిరుస్తాయి. ఈ పూల పండుగ కోసం ఎదురు చూస్తూ.. అత్తగారింట్లో ఉన్న ఆడపిల్లలు మెట్టినింటి నుండి పుట్టినింటికి వస్తారు.
తెలంగాణలో శతాబ్దాలుగా జరుపుకుంటున్న ఈ పండుగ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో చారిత్రక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు నవాబులు, భూస్వాములు, పెత్తందార్లతో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని, తోటి మహిళలు పూజించే వారు. అట్లా వారి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ అంటూ పాడేవారు. మరో చారిత్రక కథనం ప్రకారం చోళ రాజుల కాలంలో వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుండి వేరు చేసి తంజావూరు (తమిళనాడు)కు తరలించారు. దాంతో తమ దుఃఖాన్ని ఆనాటి చోళ రాజులకు తెలియజేస్తూ మేరు పర్వతములా పూలను పేర్చి బతుకమ్మను ఆడేవారు. తమ భావనలను కైకట్టి పాడేవారరు. ‘బృహదమ్మ’ పేరే చివరకు బతుకమ్మగా మారిందని అంటారు. వెయ్యి ఏళ్ళుగా బతుకమ్మ పండుగ చేసుకోవడం సంప్రదాయంగా వస్తోందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

ఇంకో పౌరాణిక కథ ప్రకారం, ఆనాటి చోళరాజు ధర్మాంగదునికి సంతానం ఉండదు. అనేక నోములు, వ్రతాలు ఫలితంగా ఆయన భార్యకు నూరుగురు పుత్రులు పుడతారు. అయితే, కాలం కలిసి రాక వారంతా యుద్ధాలలో ప్రాణాలు కోల్పోతారు. ఆ రాజదంపతులు తీరని దుఃఖంతో లక్ష్మీ దేవిని కొలుస్తారు. ఆ దేవతనే తమ కడుపున పుట్టమని వేడుకుంటారు. లక్ష్మీదేవి వారికి కుమార్తెగా పుడుతుంది. మునులంతా వచ్చి ఆమెను, ’నిండు నూరేళ్లు బతుకమ్మా’ అని దీవిస్తారు. అలా లక్ష్మీదేవే ’బతుకమ్మ’ గా పిలువబడుతుందని చెబుతారు. మహావిష్ణువు మరో చోట చక్రాంకుడనే రాజుగా జన్మిస్తాడు. అతనే లక్ష్మీ స్వరూపులైన బతుకమ్మను పెళ్లి చేసుకుంటాడు. నాటి నుండి దేశ ప్రజలంతా లక్ష్మీదేవి అవతారంగా బతుకమ్మను పూలతో అలంకరించి పండుగ జరుపుకుంటున్నారు.

బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి మరొక జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. ఓ రైతుకు ఏడో సంతానంగా ఆడపిల్ల పుడుతుంది. అంతకు ముందు పుట్టిన ఆరుగురు ఆడపిల్లలు చనిపోతారు. దాంతో ఈమెను బతికిన అమ్మగా భావిస్తారు. అమ్మ నాన్నలే కాదు, ఊరూవాడ జనులంతా అప్పటి నుంచి ’బతుకమ్మ’ అని పిలుస్తారు. ఆమెతోడ ఒక్కడే అన్న. అతనికి చెల్లెలు అంటే పంచప్రాణాలు. బతుకమ్మకు పెళ్లి కాగానే అత్తగారింటికి పంపుతారు. భర్త ఆమెను బాగా చూసుకుంటాడు. అయితే పుట్టింటికి వచ్చిన సమయంలో వదిన, బతుకమ్మ పట్ల అన్న చూపించే ప్రేమని భరించలేక పోతుంది. అసూయ పడతది. అన్న ఊరు వెళ్లిన సమయం చూసుకొని, బతుకమ్మతో వదిన కలిసి చెరువు వద్దకు వెళతారు. అవకాశం కోసం ఎదురు చూసే వదిన, బతుకమ్మను గొంతు పిసికి చంపేస్తుంది. అక్కడే గొయ్యి తీసి పాతి పెడుతుంది. కానీ, అదే రోజు రాత్రి బతుకమ్మ తన అన్నకు కలలో వచ్చి విషయమంతా చెబుతుంది. చెరువు కట్టపై తాను తంగేడు చెట్టుగా పుట్టానని, వెంటనే వచ్చి తీసుకెళ్ళమని ప్రాధేయ పడుతుంది. అన్న వెళ్లి చూడగా అక్కడ తంగేడు చెట్టు బతుకమ్మ రూపంలో దర్శనమిస్తుంది. ఇతర పూలతో కలిపి తంగేడు పూలు జోడించి, బతుకమ్మను పేర్చి నీటిలో నిమజ్జనం చేయమని కోరుతుంది. ఇక అప్పటి నుంచి బతుకమ్మను పూజించే ఆచారం ఏర్పడిందని అనేక మంది విశ్వాసం.

బతుకమ్మను పేర్చి, మధ్యలో పసుపుతో గౌరమ్మను నిలుపుతారు. పూజలు చేసి. ధూప దీప నైవేద్యాలు సమర్పించి బయటకు తీసే ముందు బతుకమ్మను ఆ ఇంటి ఆడపడుచు తలమీద లేదా చేతులతో పట్టుకొని ఇంటి ముందు నిలబడ్డప్పుడు కొబ్బరికాయ కొట్టి, కాళ్లకు నీలారా పోసి డప్పు చప్పుళ్ళతో సమీపంలో ఉన్న దేవాలయం ప్రాంగణం లేదా విశాలమైన చావిడి వద్దకు సమూహంగా వెళ్తారు. బతుకమ్మలను ఒక చోట పెట్టి తీరోక్క పాటలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఆడతారు.

బతుకమ్మ పాటల్లో గ్రామీణ జీవనం ఉట్టి పడుతుంది. ఈ పాటలన్నీ తెలంగాణ సంస్కృతిని, విశిష్టతను చాటిచెబుతాయి. అసలు బతుకమ్మ అంటే ఓ రంగుల కల. పూల పండుగ. ఆడపడుచుల జానపద పాటలు, కోలాటం పాటలు, ఉయ్యాల పాటలు ఇలా ప్రతి ఒక్కటి సాంస్కృతిక వైభవాన్ని తరతరాలకు తెలియజేస్తాయి.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News