Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

ఈసారీ బడ్జెట్ ‘కోత’లేనా!?|EDITORIAL

బడ్జెట్ అంటే ఆదాయ, వ్యయాల పట్టిక మాత్రమే కాదు. భవిష్యత్తును నిర్ణయించే దిశానిర్దేశ ప్రణాళిక. కానీ, బడ్జెట్ అంటే కేవలం పన్నులు, రాయితీలు, కోతలు, కేటాయింపులుగా మారిపోయింది. బడ్జెట్ కేటాయింపుల్లో కామన్ మ్యాన్ కనిపించకుండా పోతున్నాడు. వృద్ధి శాతం, జీడీపీ అంచనాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు వినిపిస్తాయి. కానీ, నిరుద్యోగం, అప్పుల భారం, గిట్టుబాటు లేని రైతుల ఆత్మహత్యలు ఈ గణాంకాల్లో గల్లంతవుతున్నాయి.

దేశ భవితకు మూలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థే. జనాభాలో 65% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. అయినా బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు దక్కుతున్న ప్రాధాన్యం తక్కువే. వ్యవసాయాధారిత దేశంలో రైతులకు దిక్కులేకుండా పోతోంది.

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.33.8 లక్షల కోట్లకు చేరింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 66.7 శాతం. ఇందులో రెవెన్యూ వ్యయాలు రూ.25.93 లక్షల కోట్లు కాగా, పెట్టుబడి వ్యయాలు రూ.7.87 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఉత్పాదక పెట్టుబడుల కంటే నిర్వహణ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి.

రెవెన్యూ వ్యయాల్లో వడ్డీ చెల్లింపులకే రూ.9.11 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఇది మొత్తం వ్యయాల్లో 27 శాతం. ప్రధాన రాయితీలకు రూ.3.17 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయి. అప్పులపై అప్పులు చేసుసుకుంటూ, వాటికి వడ్డీలు చెల్లిస్తూ దేశం ఒక ఆర్థిక చక్రవ్యూహంలో చిక్కుకుంటోంది.

గతేడాది డిసెంబరు చివరి నాటికి ప్రభుత్వానికి రూ.25.25 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 72.2%. ఇందులో రూ.19.39 లక్షల కోట్లు పన్నుల ద్వారా, రూ.5.39 లక్షల కోట్లు పన్నేతర ఆదాయంగా సమకూరాయి. రుణ రహిత పెట్టుబడి సాధనాల ద్వారా రూ.46,047 కోట్లు వచ్చాయి. అంటే ఆదాయం ఉన్నప్పటికీ నియంత్రణలేని వ్యయాలే ద్రవ్యలోటును పెంచుతున్నాయి.

2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 4.4 శాతంగా లేదా రూ.15.69 లక్షల కోట్లుగా అంచనా వేసింది. డిసెంబరు చివరి నాటికే ద్రవ్యలోటు రూ.8.55 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ఇది వార్షిక లక్ష్యంలో 54.5%. గతేడాది ఇదే సమయంలో ఇది 56.7 శాతంగా ఉంది. స్వల్ప మెరుగుదల కనిపించినా, అదుపులేని వ్యయం అలాగే ఉంది.

ఇందులో రాజకీయ నాయకుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు, విమాన ప్రయాణాలు, నివాస సౌకర్యాలు రెవెన్యూ వ్యయాల్లో కీలకంగా మారాయి. గత ప్రభుత్వాలతో సహా, పదేళ్లుగా మోదీ కూడా పట్టించుకోవడం లేదు. ప్రజలపై పన్నుల భారం మోపుతున్నప్పుడు, అధికార వర్గాల ఖర్చులపై నియంత్రణ ఎందుకు సాధ్యం కావడం లేదు?

మధ్యతరగతి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆదాయపు పన్ను స్లాబ్‌లు, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుపై ఆశలు ఉన్నప్పటికీ, అదుపులేని ధరలు ఆ లాభాన్ని మింగేస్తోస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, బ్యాంకుల సేవా రుసుములు, క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, కనీస బ్యాలెన్స్ నిబంధనలు ప్రతి నెలా సామాన్యుడి ఖర్చులను పెంచుతున్నాయి.

బడ్జెట్ సంప్రదాయాల్లో మార్పులు వచ్చినా, దృక్పథంలో మార్పు రావడం లేదు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం విధాన పరంగా సరైన నిర్ణయమే. కానీ ఆ ముందస్తు బడ్జెట్ వల్ల పథకాలు వేగంగా అమలవుతున్నాయా? గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతోందా?

దేశం నిజంగా ఆర్థికంగా గట్టెక్కాలంటే కాకిలెక్కల కోలాహలం. గణాంకాల మాయాజాలం కాదు. కఠినమైన సంస్కరణలు అవసరం. వృథా ఖర్చులకు కత్తెర వేయాలి. రాజకీయ వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ రావాలి. ఉత్పాదక పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే బడ్జెట్ లెక్కల పద్దుగా కాకుండా, సామాన్యుడి జీవితాన్ని మార్చే సాధనంగా మారుతుంది.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News