బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఆయనపై ఫిర్యాదు చేశారు. గతంలో షష్టి వర్మ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో, తన కాల్ రికార్డులు లీక్ చేశాడంటూ శేఖర్ బాషాపై తాజాగా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శేఖర్ బాషాపై BNS యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

