Wednesday, September 23, 2026
26 C
Hyderabad

పవన్ హామీ నెరవేరేనా!|EDITORIAL

ప్రకృతి మనకు అందించిన గొప్ప వరం. మన చుట్టూ ఉన్న సహజవనరులు. చెట్టూ, చేమా, అడవులు, సముద్రాలు, నదులు, సరస్సులు వంటి జలవనరులు, మంచినీరు, ఆహారం, జీవనాధారం మాత్రమే కాదు, అవన్నీ ఎన్నో జీవుల జీవాధారం కూడా. మనిషి నిర్లక్ష్యం వల్ల ఈ జీవ నవనరులు మరణశాసనం రాస్తున్నాయి. ప్రాణి జీవాధారమైన గాలి, నీరు, ఆహారం కాలుష్యాల వల్ల మనిషిదే కాదు మొత్తం ప్రాణుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. నీటి కాలుష్యం వల్ల అందులో ఉన్న చేపలు, ఇతర జలజీవులు అనేకమంది అజ్ఞానం, నిర్లక్ష్యం వల్ల మృత్యువాత పడుతున్నాయి.

ఇక పరిశ్రమల కాలుష్యం నదులను, చెరువులను, చివరకు సముద్రాన్ని కూడా కలుషితం చేస్తోంది. ఒకప్పుడు పటాన్‌ చెరువు, ఎల్‌బినగర్‌ సిరిస్‌ కంపెనీల కాలుష్యంపై ఏళ్లుగా పోరాటాలు జరిగాయి. హుస్సేన్‌ సాగర్‌ కాలుష్య కాసారంగా మిగలిపోయింది. కొబ్బరి నీళ్లలా హుస్సేన్‌ సాగర్‌ నీళ్లను చేస్తానన్న కేసీఆర్‌ మాటలు నోరు దాటినా, సాగర్ ను తాకలేదు. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించినా అదంతా మనకు ఉట్టిగానే తోస్తోంది. ఇప్పుడు ఏపీలో ఉప్పాడ కాలుష్యంపై మత్స్యకారులు పోరాటం చేస్తున్నారు. డిప్యూటి సీఎం పవన్‌ కళ్యాణ్‌ గట్టిగానే స్పందించారు. అయితే ఆయన పట్టుదల ఎంతవరకు కార్యరూపం దాలుస్తందన్న తేలాల్సి ఉంది.

ఉప్పాడలో మాత్రమే కాదు, విశాఖలో సముద్రజలాల కాలుష్యం ఇంతకుమించి ఉంది. కాకినాడలో పారిశ్రామికంతోపాటు, మైనింగ్‌ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై అధికారులతో పవన్‌ కళ్యాణ్‌ చర్చించారు. కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో ‘మాట-మంతి’లో మత్స్యకారులు సమస్యలపై పీసీబీ నుంచి వివరాలు తీసుకున్నారు. పొల్యూషన్‌ ఆడిట్‌కి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. కాకినాడ జిల్లాతోపాటు గోదావరి జిల్లాల్లో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై వివరాలు తెలుసుకున్నారు. ఇక ఎలాంటి అడుగులు వేస్తారన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచి ఉంది.

నిజానికి ఉప్పాడ తీరంలో ఉంటున్న జాలరులు సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరి ఉపాధిని ఇబ్బడి ముబ్బడిగా వెలసిన ఫార్మా కంపెనీలు గండి కొడుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతుండడంతో చేపలు, జాలరులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కాకినాడ జిల్లా కెఎస్‌ఇజడ్‌ పరిధిలో లైఫిజ్‌, అరబిందో ఫార్మా లాంటి కంపెనీలు వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు యు.కొత్తపల్లి మండలంలో కోనపాపపేట, తొండంగి మండలం పెరుమల్లపురం మధ్యలో మూడు కిలోమీటర్ల పొడవునా భారీ పైపు లైన్‌ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఫార్మా వ్యర్థాలు, విషపూరిత జలాలను శుద్ధి చేయకుండానే సముద్రంలోకి నేరుగా వదిలేస్తున్నారు. తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న హేచరీల ద్వారా రసాయనిక జలాలు, ఇతర వ్యర్థాలు సముద్రంలోకి వదిలేస్తున్నారు. దీనివల్ల చేపలు దూరంగా వెళ్లిపోయాయి. కొన్ని చేపలు చనిపోతున్నాయి. గతంతో పోలిస్తే, ప్రస్తుతం చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. జాలర్లకు, చేపల పెంపకందారులకు నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.
ఈ కాలుష్యంపై పోరాటం గత ప్రభుత్వ హయాం నుంచీ జరుగుతోంది. ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మారిన తర్వాతైనా న్యాయం జరుగుతుందని ఆశించారు. వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి వదలాలని కోరుతున్నారు. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ నుంచి తొండంగి మండలం అద్దారిపేట వరకు 32 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఈ రెండు మండలాల్లో 18 గ్రామాలకు చెందిన 50 వేల మంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవిస్తున్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్లే చేపలు చనిపోతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో చిన్నబోటుపై వేటకు వెళ్తే రోజుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల విలువైన చేపలు దొరికేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. ఒక్కసారి వేటకు వెళ్తే చిన్నబోటుకు రూ.2 వేలు, పెద్ద బోటుకు రూ.25 వేల నుంచి రూ.30వేల వరకూ ఆయిల్‌కు ఖర్చవుతుందని తెలిపారు. పెద్ద బోట్లలో 12 మంది వరకూ వేటకు వెళ్తారని, 15 రోజుల వరకూ సముద్రం లోనే ఉండాల్సి ఉంటుందన్నారు. ఆయిల్‌, ఐస్‌, ఇతర నిర్వహణకు మొత్తంగా రూ.1.50 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. ఖర్చులుపోనూ గతంలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఆదాయం సమకూరేదని, ప్రస్తుతం చేపలు దొరక్కపోవడంతో ఖర్చులు కూడా రావట్లేదని ఉప్పాడ మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.

మత్స్యకారులు గతేడాది ఏప్రిల్‌లో బీచ్‌ రోడ్డుని పూర్తిగా నిర్బంధించి పది రోజులపాటు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. కాలుష్యాన్ని నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఆయన డిప్యూటీ సిఎం అయినప్పటికీ ఆ హామీ అమలు కాలేదు. దీంతో, మత్స్యకారులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. వేల సంఖ్యలో ఉప్పాడ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ స్పందించి సమస్య పరిష్కారానికి వంద రోజుల సమయం కావాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణకు దిగారు. మరి పవన్ కళ్యాణ్ హామీ ఎంతవరకు అమలవుతుందో, మత్స్యకారులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో చూడాలి.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News