Wednesday, September 9, 2026
31.8 C
Hyderabad

అమరావతి అజరామర నగరం కావాలి!

అమరావతి నగరం సాకారం కాబోతున్నది. ఏడాది కాలంగా సీఎం చంద్రాబు అమరావతి పునర్నిర్మాణానికి అహర్నిశలు కష్టపడడంతో ఆంధ్రప్రదేశ్‌ కీలక మైలురాయిని చేరుకుంది. ప్రధాని మోడీ పునర్నిర్మాణ పనుల్లో పాల్గొనడంతో వేగం పెరిగింది. నిజానికి జగన్‌ తన ఐదేళ్ల పదవీకాలంలో అమరావతిని నిర్మించివుంటే ఆయన్ని చరిత్ర గుర్తించేది. కానీ, ఇప్పుడు అమరావతి చరిత్రలో జగన్‌ తనకు చోటు లేకుండా చేసుకున్నారు. అంతేగాకుండా మూడు రాజధానులు అంటూ ఐదేళ్లూ కాలం వెళ్లదీసారు. ఈ లోగా కాలంతోపాటు ప్రజలు కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నారు.

నిజానికి చంద్రబాబు విజన్‌కు జగన్‌ ఆలోచనకు ఎంతో తేడా ఉంది. చంద్రబాబును కాదని ఒక్క ఛాన్స్‌ అని అభ్యర్థించిన జగన్‌కు ప్రజలు పట్టం కట్టారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఓ పదేళ్లు వెనక్కి పోవడమే గాకుండా అప్పులకుప్పగా మారింది. అప్పులు చేసిన జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంలోకి నెట్టారు. యువకుడైన జగన్‌కు నిజంగానే మంచి ఆలోచనలు ఉండివుంటే ఎపి భవిష్యత్‌ మరోలా ఉండేది. విజన్‌ ఉండాలి. పట్టుదల ఉండాలి. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పనులు చేయగలగాలి. బటన్‌ నొక్కి అప్పులు చేసిన జగన్‌ విజన్‌ లేని నేతగానే నిలిచిపోయాడని చెప్పాలి. అయితే, ప్రజలు వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు సమిష్టి ప్రయోజనాలు కూడా ఆశిస్తారు. విద్య, వైద్యం, నీరు, రోడ్లు వంటి సౌకర్యాలపై ప్రభుత్వాల ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతుండాలి. ఇవేవీ లేకపోగా, ప్రజలపై అప్పుల భారం పడింది. ప్రతీకార కేసులు ప్రజల్ని కూడా విసిగించాయి. ప్రజలు మరోసారి మార్పును కోరుకున్నారు. అందుకే మళ్లీ అమరావతిని రాజధానిగా పునర్నిర్మిస్తామని తెలుగుదేశం కూటమి హావిూ ఇచ్చింది. అధికారంలోకి రావడంతో అది సాకారం కాబోతున్నది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత పదేళ్లుగా రాజధాని లేకుండా పోయింది. అమరావతిని దెబ్బతీసే ప్రయత్నంలో జగన్‌ రాజధాని లేకుండా చేశారన్న అపవాదుని మూటగట్టుకున్నారు. మూడు రాజధానుల సంగతి పక్కన పెడితే అసలు రాజధానే లేకుండా పోయింది. తల లేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ గత ఐదేళ్లుగా కొనసాగింది. అభివృద్ధి వికేంద్రీకణ వేరు, రాజధాని వేరు అన్న స్పృహలో లేకుండా జగన్‌ పాలన సాగించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన పలువురు రైతులు, మహిళలు కోర్టుల చుట్టూ తిరగడంతోనే సరిపోయింది. కేసులతో వారిని కోర్టులకే పరిమితం చేస్తే ఇక ఉద్యమంలో కనిపించరన్న ఎత్తుగడతో గత పాలన సాగింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్న చందంగా కేసులకు కొదవ లేకుండా పోయింది. జగన్‌ తన ఐదేళ్ల పాలనాకాలంలో కనీసం రైతులతో మాట్లాడకుండా, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది.

విభజనకు గురైన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనివార్యంగా ఇప్పుడు కొత్త రాజధానికి శ్రీకారం చుడుతోంది. ఓ ఐదేళ్ల తరవాత అమరావతితో ఏపీ రూపురేఖలు మారనున్నయి. ఓ అద్భుత నగరం ఆవిష్కృతం అవుతుందనడంలో సందేహం అవసరం లేదు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ తెలుగు వారికి ఒక విద్యా, వ్యాపార, నివాస, ఉపాధి, ఆదాయ వనరుగా మారిపోయింది. హైదరాబాద్ లాంటి నగరం ఒక్కటి కూడా ఏపీలో లేకుండా పోయింది. విశాఖపట్నం, విజయవాడ నగరాలు హైదరాబాద్ స్థాయి నగరాలు కావు కనుకనే చంద్రబాబు కొత్త రాజధానికి శ్రీకారం చుడుతున్నారు. విశాలమైన సముద్ర తీరంతో పాటు, పలు విమానాశ్రయాలు, ఓడరేవులు ఉన్న ఏపీ ఇక అమరావతితో మరింతగా అలరారడం ఖాయంగా కనిపిస్తున్నది. హైదరాబాద్‌ లాంటి విస్తృత అవకాశాలు గల ఒక నగరం ఆంధ్రకు లేని లోటును అమరావతి తీర్చనుందనడంలో సందేహం లేదు. అంతేకాదు అంతర్జాతీయనగరంగా హైదరాబాద్‌కు దీటుగా, పోటీగా విస్తరిస్తే అంతకంటే సంతోషం కూడా మరోటి ఉండదు. నిజానికి చంద్రబాబు రెండోసారి సీఎం అయి ఉంటే ఈపాటికి అమరావతి సాక్షాత్కరించేది. అమరావతి అంటే ప్రపంచస్థాయి వ్యాపార, వాణిజ్య భవనాలు, పబ్లిక్‌ పార్క్ లు, వినోద కేంద్రాలు, ఐకానిక్‌ నిర్మాణాలు, సువిశాలమైన రహదారులు, నైట్‌ లైఫ్‌ వినోద కార్యకలాపాలు అందించే సఫారీ టూర్ల వెసులుబాట్లు, టూరిస్ట్‌ ఆకర్షణలు. ఇవేగాక అంతర్గత రవాణా సదుపాయాలు వంటివన్నీ అందుబాటులోకి వస్తాయి. అనేక సదుపాయాల సముదాయంగా అమరావతి పేరిట ఒక మహానగరం నిర్మించాలన్న చంద్రబాబు నాయుడు సంకల్పం అభినందనీయం.

ప్రపంచంలో అనేక నగరాలను తిరిగి, అధ్యయనం చేసిన అనుభం చంద్రబాబుది. ఆయన తన రాజకీయ జీవితం కన్నా తన పేరు చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షించే వ్యక్తి. చంద్రబాబు దార్శనికుడు కావడం వల్ల ప్రపంచ స్థాయి నగరంగా ’అమరావతి’కి బలమైన పునాదులు వేస్తున్నారు. తన దార్శనికతతోనే అమరావతిని ఓ అద్భుత వాణిజ్య నగరంగా తీర్చిదిద్దే పనిలో ప్రధానిని ఆహ్వానించి పునాది వేయించడం, పునరావిష్కృతం చేయడం చరిత్రలో నిలిచే మహోజ్వల ఘట్టం. ఇది పూర్తిగా సాకారం కావడానికి కనీసం ఓ దశాబ్ద కాలం పట్టవచ్చు. అప్పటి వరకు చంద్రబాబును ప్రలజు ఆదరిస్తే ఏపీని అగ్రభాగాన నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు దార్శనికతకు సజీవ సాక్ష్యంగా చరిత్రలో అమరావతి నగరం నిలిచిపోతుంది. కృష్ణా పరివాహక ప్రాంతం కావడం నీటికొరత లేకుండా అమరావతి అలరారుతందనడంలో సందేహం లేదు. అమరావతి భారతదేశంలో అద్భుత నగరంగా నిలిచిపోతే తెలుగువాళ్ళందరికీ గర్వకారణమే.

Latest News

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News