WARANGAL| వరంగల్ ASP| ఏఎస్పీగా శుభం ప్రకాష్ నియామకం
తెలంగాణలో పోలీసు శాఖలో విస్తృత బదిలీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 44 మంది సబ్ డివిజనల్ పోలీసు అధికారులను (డీఎస్పీ) బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో వరంగల్ POLICE COMMISSIONERATE| పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీలక మార్పు చోటుచేసుకుంది. వరంగల్ డివిజన్ ఏ.ఎస్పీగా ఐపీఎస్ అధికారి ఎన్. శుభం ప్రకాష్ ను ప్రభుత్వం నియమించింది. 2022 బ్యాచ్‌కు చెందిన శుభం ప్రకాష్ 2024లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ట్రైనీ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహించారు. ఆరు నెలల పాటు పలు క్రైం, లా అండ్ ఆర్డర్ వ్యవహారాల్లో అనుభవం పొందిన శుభం ప్రస్తుతం వరంగల్ ప్రాంతానికి పూర్తి స్థాయి ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇతర ప్రదేశాలకు బదిలీ అయిన వారిలో వరంగల్ ప్రస్తుతం ఏసీపీగా పనిచేస్తున్న నందిరాం నాయక్ కూడా ఉన్నారు. ఆయనను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.
బదిలీ అయిన అధికారుల వివరాలు ఈ క్రింది లింకు ను క్లిక్ చేయగలరు.


