శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం.

కనీ, పెద్ద పెద్ద స్టార్ హోటల్లు, పంక్చన్లల్ల తినడం కూడా ఓ స్టేటస్ సింబల్. గట్లనే గా స్టార్ హోటల్లల్ల శేత తింటే తక్కువ సూత్తరట. మరెట్ల తినాల్నంటే.. శెంషె గదేనుల్లా స్పూన్ తోటే తినాల్నట. ఓ శేత ఫోర్కు, మరో శేత శెంషె పట్టుకుని గా దోశను మూడు భాగాలుగా, ఒక్కదగ్గరికి ఒత్తిండు. గా ఫోర్కు, శెంషెతోటి శిన్న శిన్న ముక్కలు శేసి తినాల్నని సూపిండు. గదాన్ని గూడా ఈడియ తీసిండ్రు. ‘పదిహేను వందల రూపాలు పెట్టి స్టార్ హోటల్ల దోశ ఆర్డరేసినా, గదాన్ని స్పూన్ తోనే తినాలె’ అని పైన రాసి, గదాన్నిప్పుడు నెట్టింట్ల పెట్టిండ్రు. ఇగ గా ఈడియను నెటిజన్లు తెగ సూత్తాండ్రు. ‘గిట్ల గూడా తినొచ్చా భయ్యా? అని ఒకాయినె, ‘సూడ్డానికి నవ్వొస్తున్నా, గిట్ల గీ శెంషెలతోటి దోశ తినుడు తిప్పలే’ నని ఇంకాయినె. ‘ఎహె తియ్.. మన వంటల్ని మన లెక్కనే తినాలె’ అని మరొకాయినె కామెంట్లు శేసిండ్రు. మరి మీరేమంటరు.!?

