తెలంగాణలో ఇటీవల నిర్వహించిన కుల గణన సర్వే ప్రకారం, రాష్ట్ర జనాభా మొత్తం 3,54,77,554 కాగా, కుటుంబాల సంఖ్య 1,12,15,134గా ఉంది. ఈ సర్వే వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కులాల వారీగా చూస్తే, ఎస్సీల జనాభా 61,84,319 (17.43%)గా ఉండగా, ఎస్టీల సంఖ్య 37,05,929 (10.45%)గా ఉంది. బీసీల సంఖ్య అత్యధికంగా 1,64,09,179 (46.25%)గా నమోదైంది. బీసీ ముస్లింల జనాభా 35,76,588 (10.85%) కాగా, ఓసీ ముస్లింల సంఖ్య 8,80,424 (2.48%)గా ఉంది. మొత్తం ముస్లిం జనాభా శాతం 12.56%గా ఉంది. ఓసీల జనాభా 15.79%గా నమోదైంది. ఈ గణాంకాలు రాష్ట్రంలోని సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయని మంత్రి తెలిపారు.

