కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెబుతూ పార్టీకి రాజీనామా చేశారు. మేయర్‌తో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్‌ఎస్‌ను వీడుతూ కమలంలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరంతా బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో రేపు బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఇటీవల తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు, బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నాయకులు కూడా ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతుండగా, తాజా పరిణామంలో మేయర్, కార్పొరేటర్లు కూడా పార్టీని వీడడం గులాబీ శిబిరానికి గట్టి దెబ్బగా కనిపిస్తోంది.

