కూకట్పల్లి JNTUలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్టుకు రూ. లక్ష చొప్పున డబ్బులు వసూలు చేసి పాస్ చేయడం సిగ్గుచేటని ABVP స్టేట్ యూనివర్సిటీస్ కో-కన్వీనర్ నూకల నాగరాజ్ విమర్శించారు. ఇది వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చే చర్యగా అభివర్ణించారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ABVP విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్ద నిరసన చేశారు. ప్రభుత్వానికి, వర్సిటీ అధికారులకు నోటీసులు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

