Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

నేను సాఫ్ట్ కాదు… నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తే రచ్చ రచ్చే…

-ఎమ్మెల్యే యశస్విని

మా విషయంలో చిల్లర ప్రచారాలు మానుకో – మా కుటుంబ విషయాలు నీకెందుకు

విరుచుకుపడ్డ ఝాన్సీ రెడ్డి

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఝాన్సీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు రూ.450 కోట్లు నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. పాలకుర్తిలోని 50 పడకల ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, రాయపర్తిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామని చెప్పారు. పెద్దవంగరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండటం వల్ల, వాటికి స్వంత భవనాల నిర్మాణంకు త్వరలో శంకుస్థాపన చేస్తామని వివరించారు.తమ పాలనలో చేస్తున్న అభివృద్ధిని చూసే రోజులు త్వరలోనే వస్తాయని చెబుతూ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. “ఇన్ని రోజులు ఏం అభివృద్ధి చేశావో చెప్పాల్సిన అవసరం లేదు, నేను అభివృద్ధి చేసి చూపిస్తా,” అంటూ విరుచుకుపడ్డారు. పాలకుర్తి మండలంలోని చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను తన హయంలోనే పూర్తిచేస్తానని తెలిపారు. పైగా, రిజర్వాయర్ అంశంపై మరోసారి చర్చకు సిద్ధంగా ఉన్నానని, దయాకర్ రావు సిద్ధంగా ఉంటే ముందుకురావాలని సవాల్ విసిరారు.తన నియోజకవర్గ అభివృద్ధే తన కర్తవ్యం అని స్పష్టం చేసిన ఆమె, “మా కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయొద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది,” అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక, పాలకుర్తి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సన్న బియ్యం విషయంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని వెల్లడించారు. “పార్టీ కాదు, అర్హతతోనే ప్రజలు ఎన్నుకుంటారు,” అని స్పష్టం చేశారు.

ఇక నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ, “బిడ్డా కాస్కో ఇక…” అంటూ… ఎర్రబెల్లి నోట్లపై ఉన్న మమకారంతో బంధాల విలువ మరచిపోయాడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంత సంపాదించారని ప్రశ్నించారు. డబ్బు, అధికారం వ్యాపారం కాదని, తాము సమాజ సేవ కోసమే ఉన్నామని స్పష్టం చేశారు. “నీ అంతు చూస్తా, నీ చెంచాల సంగతి చూస్తా” అంటూ హెచ్చరికలు చేస్తూ, మాట జాగ్రత్తగా వాడుకోవాలని, అన్యాయాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ భూముల కబ్జాలు, నియోజకవర్గ అభివృద్ధిపై ఎర్రబెల్లి చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, అతని కోవర్టుల విషయాలు కూడా తెలిసినవేనని అన్నారు. “అమావాస్య, పౌర్ణమి ఒకటే కాదని గుర్తుపెట్టుకో” అంటూ తీవ్రంగా స్పందించారు. ప్రజల తీర్పే తుదితీర్పు అని, వారి కుటుంబాల్లో మేము సభ్యులం అని వినమ్రతతో చెప్పినప్పటికీ, ఇక ఉపేక్షించేది లేదని, రోజుల లెక్క పెట్టుకో… అంటూ.. హెచ్చరించారు. ఎర్రబెల్లి ఊసరవెల్లి పోకడలు మానుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకే ఏడాదిలో బీఆర్‌ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. పాలకుర్తిలో ప్రజలకు స్వతంత్రం వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించడం ఖాయమని చెప్పారు. “దయాకర్ రావు, నిన్ను మళ్లీ చిత్తుచిత్తుగా ఓడిస్తాం,” అంటూ స్పష్టంగా హెచ్చరించారు. ఆయన పాలకుర్తిలో దోచుకొని, ఆస్తులను అమెరికాలో దాచి పెట్టాడని ఆరోపించారు. . “నువ్వు తయారు చేసిన కోవర్టుల అంతు చూస్తాం. నీవు వేసిన పావులా పనిచేస్తున్న వారినీ వదిలిపెట్టం,” అంటూ హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/jifLZNl6_Fo?feature=shared

https://youtu.be/cvRGXoEB894?feature=shared

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News