Monday, July 13, 2026
29.3 C
Hyderabad

మొదటి దశలో 5 లక్షల మంది యువతకు ఉపాధి

పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్  ఏర్పాటు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన సమావేశమైన మంత్రులు దుదిల్ల, పొంగులేటి 

హైదరాబాద్ నగర శివారులో పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటి నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పరిశ్రమల, రెవెన్యూ శాఖ కీలక అధికారులతో వారు సమావేశం నిర్వహించారు. పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారుల కోసం ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించింది. వీరితోపాటు రెవిన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ తదితర సొసైటీలకు సుమారు 200 ఎకరాలకు పైచిలుకు భూమిని ప్రభుత్వం కేటాయించింది. పుప్పాలగూడ పరిధిలో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు సబ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ భూమికి పక్కనే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కు సంబంధించిన సుమారు 250 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లుగా అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. మొత్తంగా మొదటి దశలో ఐటి నాలెడ్జ్ హబ్ అభివృద్ధికి సుమారు 450 ఎకరాలు అందుబాటులో ఉంది అని చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా ఐదు లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రుల బృందానికి సూచించారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది, ఆ తర్వాత నాలెడ్జ్ హబ్ ఏర్పాటయింది, ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూపు దిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతి మార్పులో హైదరాబాద్ భాగస్వామి అయిందని, ఇప్పుడు కూడా ఐటీ రంగంలో AI టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పును హైదరాబాద్ అందిపుచ్చుకోవాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో సుస్థిర స్థానాన్ని ఇప్పటికే సాధించింది, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదని ఆర్థికవేత్తలు స్పష్టం చేసిన విషయాన్ని మంత్రులు చర్చించారు. అభివృద్ధిని కొనసాగించే క్రమంలో పుప్పాలగూడలో 450 ఎకరాల్లో నాలెడ్జ్ హబ్ అభివృద్ధి చేస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న హైదరాబాద్ ప్రగతిని వేగవంతం చేయాలని నిర్ణయించారు.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News