Monday, July 20, 2026
25.8 C
Hyderabad

మొగోల్లను గౌరవిద్దాం!?|ADUGU TRENDS

ఎర్రబస్సుల్ల ఎన్కటేం రాసుండేదో గుర్తుందా!? ఒకపాలి గుర్తు శేసుకోండ్రి. ‘పొగ తాగరాదు!’, ‘టికెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండి.’ ఇంక..? ‘టికెట్ లేని ప్రయాణం నేరం. రూ.500 వరకు జరిమానా, జైలు శిక్ష!’ ఇంకా…? గుర్తు శేసుకోండ్రి. ‘మహిళల్ని గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లల్లో వాళ్లనే కూర్చోనిద్దాం.!’ అద్గది.. నిజమే కదా? కనీ, కాలం మారినా, బస్సులు పెద్దగ మారలేదు. కనీ, స్లోగన్లు మారినయి. ఇగిప్పుడు గయన్నీ కనిపిత్త లేవు. ఒకేల ఉన్నా, గవాటికి కాలం శెల్లింది. గవాటి తానంల కొత్త నినాదాలొచ్చినయి. గందులోదొకటే… గీ ‘పురుషులను గౌరవిద్దాం. వాళ్ళకి కేటాయించిన సీట్లల్లో వారినే కూర్చోనిద్దాం-టీజీఎస్ఆర్టీసీ.’

ఇగిప్పుడు గా సర్కారోల్లు, ఎర్రబస్సుల్ల ఆడోల్లకు ఉచిత పయాణమంటిరి. గిదీంతోటి బస్సుల్ల టొంబై శాతం గా ఆడోల్లే ఎక్కబట్టిరి. ఐదు, పది శాతం లేని మొగోల్లు నిలబడబట్టిరి. గిదంత పని కాదని ఎవలో గా నినాదాన్ని మార్సి రాసిండ్రు. ఇగిప్పుడు గది నెట్టింట్ల తెగ వైరలైతాంది.

మా నాయిన శెప్తాంటడు. వెన్కటికి వాళ్ళకు సిద్ధం వాసుదేవ్ సారు తెలుగు శెప్తుండేదట. గా సారు ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగనే ఉండు. గా సారు ఓ పాలి క్లాసుల… ‘మహిళల్ని గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లల్ల వాళ్లనే కూసోనిద్దాం.!’ అన్నది ఏదో ఓ రోజు పోతదిరా… గదాని తానంల ‘పురుషులను గౌరవిద్దాం. వాళ్ళకి కేటాయించిన సీట్లల్లో వారినే కూర్చోనిద్దాం’ అనేది వత్తదిరా! రాసి పెట్టుకోండ్రి. ఆర్టీసీ బస్సుల్ల రాసి పెడ్తరు సూడుండ్రి.’ అన్నడట. గా ముచ్చటే గిప్పుడు నిజమైందన్నట్లు!?

Latest News

ఒక్క స్కూల్.. వేల మంది ఐఏఎస్‌లు!|SCHOOL|IAS

నేతర్‌హాట్ విద్యా మోడల్‌కు దేశమంతా ఫిదా|NETHERHAT|EDUCATIONAL MODEL ప్రకృతి రమణీయత ఉట్టిపడే కొండల నడుమ, చుట్టూ దట్టమైన అడవులు, ప్రశాంతమైన వాతావరణం. ఒక సాధారణ పాఠశాలలా కనిపించే ఆ ప్రాంగణం.. యావత్ భారతదేశ పరిపాలనా...

జూలై 20, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి షష్ఠి ఉదయం 07.00 వరకు ఉపరి సప్తమి నక్షత్రం హస్త రాత్రి 11.01 వరకు ఉపరి చిత్త యోగం శివ రాత్రి 11.07 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం 07.00 వరకు ఉపరి...

కాళేశ్వరం కలహాలతో కాలం వెళ్ళదీయలేరు!?|EDITORIAL

ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 19 నుండి జూలై 25 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు క్రమంగా విజయవంతమవుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో ఆదాయం...

జీవిత ఖైదీలకు జైల్లోనే లగ్గం!?|ADUGU TRENDS

మనసు ఎవ్వలి మీద ఎప్పుడు? ఎందకు? పడ్తదో తెల్వదంటరు. గదాన్నే పేమ అంటాండ్రు. గట్లనే జైల్లో జీవిత ఖైదుగా ఉన్న ఇద్దరు మనసు పడ్డరు. గా ముచ్చటను జైలు సార్లకు శేరవేసిండ్రు. గానుంచి...

వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రత్యర్థులే. కానీ, ప్రజా ప్రయోజనాల విషయంలో భాగస్వాములే. అందువల్ల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా నిర్మాణాత్మక చర్చలకు వేదిక...

జూలై 18, శనివారం, 2026|RASHI P[HALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చవితి ఉదయం 08.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుబ్బ రాత్రి 10.28 వరకు ఉపరి ఉత్తర యోగం వరీయాన్ రాత్రి 01.45 వరకు ఉపరి పరిఘ కరణం భద్ర ఉదయం 08.30 వరకు ఉపరి...

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News