Friday, July 17, 2026
26.4 C
Hyderabad

గొప్పల కొప్పుల అప్పుల కుప్పలు!|EDITORIAL

ప్రపంచమంతా అప్పుల్లోనే…
పాలకులంతా గొప్పల్లోనే…
ప్రపంచం అప్పుని ప్రతి ఒక్కరికీ పంచితే రూ.11 లక్షలు
మన రాష్ట్రాల అప్పుని పంచితే ఒక్కొక్కరిపై రూ.1.18 లక్షలు

కాదే దేశం రుణాలకనర్హం! ప్రపంచమంతా అప్పుల మయం!! పాలకుది గొప్పల జపం!!! చివరకు ఆ దెయ్యాల దిబ్బ కూడా.. గొప్పల కొప్పుల అప్పుల కుప్పే!?

ప్రపంచంలో ఎంత అప్పు ఉందో తెలుసా? ప్రపంచం మొత్తం అప్పు 102 ట్రిలియన్ డాలర్లు అంటే రూ. రూ.8,67,53,95,80,00,00,001. ప్రపంచ జనాభా 8.2 బిలియన్లు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి కంటే ప్రపంచ రుణం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ రుణం మొత్తం జీడీపీలో 93 శాతానికి చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా అత్యధిక రుణాన్ని కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్ 7వ స్థానంలో ఉంది. ఒక నివేదిక ప్రకారం ఆ అప్పుని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ పంచితే దాదాపు రూ.11 లక్షల ఉంటుంది. దేశంలో యూపీఏ హయాం వరకు 60 లక్షల కోట్లు ఉన్న దేశం అప్పు, వడ్డీలకి కావాల్సిన కొత్త అప్పులతో రూ.160 లక్షల కోట్లుకు చేరుకుంది. ఇక దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పు భారీగా పెరిగిపోతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించిన అప్పుల డేటాను విడుదల చేసింది. తమిళనాడు రూ.8.3 లక్షల కోట్లతో 1వ స్థానంలో ఉంది. తెలంగాణ రూ.5.4 లక్షల కోట్లతో 7వ, ఏపీ రూ.4.9 లక్షల కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒక్కో వ్యక్తిపై దాదాపు రూ.1.18 లక్షలు అప్పు ఉన్నట్లు తేలింది!

‘అభివృద్ధి, సంక్షేమం మా ప్రభుత్వానికి రెండు రెండు కళ్ళు. జోడెద్దుల్లా ప్రభుత్వాలను నడిపిస్తున్నవి అవే. బండికి రెండు ఇరుసుల్లా ఆ రెండే ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి.’ ఇలా పాలకుల ఆర్భాటాలు, ప్రచార పటాటోపాలు ఉంటున్నాయి. బడ్జెట్ లో అభివృద్ధికి, సంక్షేమానికి చెరి సమానమైన కేటాయింపులు ఉంటున్నాయనేది ఈ మాటల అర్థం. కానీ, పరమార్థం వేరే ఉంది. మొత్తం బడ్జెట్ లో సగం ఉద్యోగుల జీత, భత్యాలకే పోతోంది. మిగిలిన సగంలోనే చెరిసగం కేటాయింపులుంటున్నాయి. ఇందులోనూ మరో మాయ ఉంది. ఫలానా చోట నుంచి నిధులు వస్తాయని ఊహించి లేదా అంచనా వేసి, రాబడిని అధికంగా చూపి, ముందుగా బడ్జెట్ ని అమాంతం పెంచేస్తారు. ఇంత పెద్ద మొత్తం బడ్జెట్ పెట్టామని గొప్పలు పోతారు. కేటాయింపుల్లో అరకొర కూడా ఖర్చు చేయరు. ప్రభుత్వాల ప్రాథామ్యాలన్నీ, ప్రజావసరాలు కాకుండా..పార్టీల, పాలకుల ప్రాధాన్యతలను బట్టి ఉంటాయి. అధికారంలోకి రావడానికి అవసరమైన హామీలేవో ఇచ్చేస్తారు. వాటిని అమలు చేయడానికి నానా తంటాలు పడుతూంటారు. దీంతో అసలు బడ్జెట్ కు, కేటాయింపులకు, చేసే ఖర్చులకు, అమలు జరిగే పనులకు, వాటి ద్వారా జరిగే అభివృద్ధికి ఏమాత్రం పొంతన, పోలికలుండవు. ఇది సాధారణంగా ప్రభుత్వాల్లో జరిగే తంతు. పైకి మాత్రం పటాటోపం ప్రదర్శిస్తుంటారు. పవర్ లో ఉంటారు కాబట్టి వారు చెప్పిందే వేదంలా ఉంటుంది. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే, ప్రతిపక్షాల అరుపులకు చిల్లిగవ్వా రాలదు. పైగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలా చేయలేదా? ఇలా మేం చేస్తే తప్పేంటి? అన్న అహంకార పూరిత బ్లాక్ మెయిలింగ్ చేస్తూ అధికార, ప్రతిపక్షాలు ఇవ్వాళ నీవంతైతే, రేపు నావంతు! అన్నట్లుగా పైకి బాగా తిట్టుకుంటూ, లోపల ఒకరికొకరు సహకరించురకుంటూ హాపీగా కాలం గడిపేస్తుంటారు. పిచ్చి ప్రజలు మాత్రం తమకేదో ఒరుగుతుందని బోలెడు భ్రమల్లో కాలం వెల్లదీస్తూంటారు.

ప్రపంచంలో ఎంత అప్పు ఉందో తెలుసా? ప్రపంచం మొత్తం అప్పు 102 ట్రిలియన్ డాలర్లు అంటే రూ. రూ.8,67,53,95,80,00,00,001. ప్రపంచ జనాభా 8.2 బిలియన్లు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా అత్యధిక రుణాన్ని కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్ 7వ స్థానంలో ఉంది. ఒక నివేదిక ప్రకారం ఆ అప్పుని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ పంచితే దాదాపు రూ.11 లక్షల ఉంటుంది. దేశంలో యూపీఏ హయాం వరకు 60 లక్షల కోట్లు ఉన్న దేశం అప్పు, వడ్డీలకి కావాల్సిన కొత్త అప్పులతో రూ.150 లక్షల కోట్లుకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే, దేశంలో ప్రతి భారతీయుడి మీదా 11 లక్షల అప్పు ఉందని ఓ అంచనా. ఇక దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పు భారీగా పెరిగిపోతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించిన అప్పుల డేటాను విడుదల చేసింది. తమిళనాడు రూ.8.3 లక్షల కోట్లతో 1వ స్థానంలో ఉంది. తెలంగాణ రూ.5.4 లక్షల కోట్లతో 7వ, ఏపీ రూ.4.9 లక్షల కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒక్కో వ్యక్తిపై దాదాపు రూ.1.18 లక్షలు అప్పు ఉన్నట్లు తేలింది.

పాలకుల ధోరణి ఎంత దౌర్జన్యంగా మారిందంటే, అప్పులు చేసి అభివృద్ధి చేశామని, ఆస్తులు పెంచామని నిస్సిగ్గుగా ప్రకటిస్తుంటారు. పైగా అప్పులు చేయందెవరు? అంటూ దబాయిస్తారు. ఇదే వైఖరిని ఆర్థిక క్రమశిక్షణ అంటూ ప్రచారం చేసుకుంటారు. పాలకుల ఈ ధోరణుల కారణంగా ఏటేటా అప్పులు పెరుగుతున్నాయి. ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం సరిపోక, స్టేటు రియల్ ఎస్టేటుగా మారుతోంది. సీఎంలు సీఇఓలుగా వ్యవహరిస్తున్నారు. దర్జాగా రియల్ దందా చేస్తూ, పాలకులు, ప్రతిపక్షాలు వెరసి నేతలంతా కలిసి కమీషన్ ఏజెంట్లుగా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేస్తున్నారు. ప్రభుత్వాలనే రియల్ ఎస్టేట్ కంపెనీలుగా మార్చి, ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా అమ్ముకుంటూ పోతున్నారు. ప్రభుత్వ నిధులను ఇష్టానుసారంగా పందేరం చేసి, ఖజానాను ఖాళీ చేసేస్తున్నారు.

సంక్షేమ పథకాలే అభివృద్దికి సోపానాలన్న చందంగా పాలన సాగుతోంది. విద్య, వైద్య రంగాలను విస్మరించారు. మంచినీటి సరఫరా సరిగా జరగడం లేదు. రోడ్ల విస్తరణ కానరావడం లేదు. దోమల నిర్మూలన అటకెక్కింది. పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో ఆర్థిక కార్యకాలాపాలు సాగడం లేదు. అయినా కొత్త కొత్త ఉచిత సంక్షేమ పథకాలతో దానకర్ణుడి పోజు కొడుతున్నారు. చేతికి ఎముకే లేదన్నట్లుగా దాన ధర్మాలు చేసేస్తున్నారు. ఇదే అసలైన అభివృద్ధి నమూనా అంటూ, దేశానికి ఆదర్శ పాఠాలు వల్లె వేస్తున్నారు.

ఉచిత విద్యుత్‌, ఉచిత బియ్యం, అందులోనూ సన్న బియ్యం, ఉచిత బస్సు, తిరిగి కట్టాల్సిన అవసరమే లేకుండా రకరకాల బంధుప్రీతి పథకాల అమలు జోరుగా కొనసాగుతోంది. ఇవన్నీ అమలు చేయడానికి అప్పులు చేయడం, ఆ అప్పులకు వడ్డీలకు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయడం, వివిధ రూపాల్లో చివరకు చెత్త పన్నులు పెంచడం, పాలకులకు అలవాటైంది. ఆదాయం పెంచే శాఖలపై ప్రేమతో అదేపనిగా సమీక్షలు చేస్తున్నారు. నిజానికి రైతులకు ఎంత ఉచిత విద్యుత్‌ అవసరమో సర్కార్ దగ్గర లెక్కలేలేవు. భూములు, కమతాలు, వాటి భూసారం, సాగయ్యే భూములు, పండే పంటలు, దిగబడులు, మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు వంటివాటిపై ప్రభుత్వాల దగ్గర లెక్కలు లేకుండా పోయింది. అందుకే లెక్కలేకుండా ఖర్చు చేయడం పరిపాటైంది. నిజానికి ఉచిత విద్యుత్‌ను కూడా లెక్కగట్టి ఇవ్వాలి. ఏ పంట పండిస్తారో చూడాలి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులతో విద్యుత్‌ కొని ఇస్తున్నప్పుడు దానికి లెక్కా పత్రం ఉండాలి. ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఖర్చు పెడుతున్న ప్రతిపైసా ప్రజలు కట్టే పన్నుల్లోంచి వస్తున్నవే. పాలకులు, అధికారులెవ్వరూ తమ జేబులోంచి చిల్లిగవ్వా ఖర్చు చేయరు. పథకాలేవైనా దుబారాను అరికట్టాలి. దూరదృష్టి లేకుండా పథకాల పేరుతో దుబారా చేస్తే నష్టపోయేది ప్రజలే!

జీతాలివ్వలేని దుస్థితి ప్రభుత్వాలకు ఎందుకు వస్తున్నది. కాంట్రాక్టర్లకు పైసలివ్వలేని ఖర్మేంటి? పాలన అంటే పప్పు బెల్లాళ్ళా పంచిపెట్టడమా? ఓట్ల కోసం సర్కార్ ఖజానాకి తూట్లు పెట్టడమా? అధికారమంటే ప్రజల జేబులు కొట్టడమా? ఉచిత పథకాలపై సమీక్ష లేదా? డబ్బుల పందేరానికి ఫుల్ స్టాపు లేదా? దుబారాపై దబాయించేది లేదా? ఉచిత పథకాల కారణంగానే ప్రభుత్వాలు అప్పుల ఊబీలో కూరుకుపోతున్నాయి. 78 ఏళ్ల స్వాతంత్ర్యం తరవాత కూడా ఇంకా పేదలు అంటూ పాలన చేయడం సరికాదు. ఇంతకాలానికి కూడా దేశంలో పేదరికం పోలేదంటే, మన పాలకులు, వారి పాలన పస ఎంతో తెలుస్తోంది. బంగారం, వెండి పళ్లెంలో అన్నం పెట్టాలని ఎవరూ కోరుకోవడం లేదు. ప్రజలు గౌరవంగా బతికేలా ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటే చాలు. అదే మేలు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News