యాదగిరిగుట్ట పాత గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజు స్వామివారి ఎదుర్కోళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిఇఓ, ఏఈఓ లతో పాటు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావు కనిపించలేదు.
ఆలయ ఈవో గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పాత గుట్టపై ఆయన దృష్టిని పెట్టకపోవడం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తరచూ పాత గుట్ట ఆలయానికి పరిశీలించకుండా ఉండడం పై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈవోలు అందరూ పాత గుట్ట ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనేవారు, ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది. దాంతో రేపు జరిగే స్వామివారి నిత్య కళ్యాణం కార్యక్రమం సందర్భంగా ఈవో గారు వస్తారా.. లేదా.. అని ఆసక్తి నెలకొంది.

