భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మారుస్తూనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో “వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)” నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ సినీ నటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సమ్మిట్‌కు సంబంధించిన సూచనలు, సలహాలు తీసుకున్నారు.
ప్రముఖ నటుడు చిరంజీవి ఈ సమావేశంలో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. “వేవ్స్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డులో భాగంగా సేవలందించడం గౌరవంగా ఉంది. మోదీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు,” అంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, నాగార్జున, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమామాలిని, దీపికా పదుకొణె తదితర ప్రముఖ నటులు పాల్గొన్నారు. అలాగే, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

