భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె. ఇగ గిదీనికి ఎంతకైనా తెగబ్తాండ్రు. ఐదు, పది రూపాయలకు పానాలు తీసేటోల్లు గూడ ఉన్నరంటే మనమెట్లుండాల్నో సూడుండ్రి. ఇగ గిసొంటి వాటిల్లకెల్లి రచ్చణ కావాల్నంటే ఇగ గీ తలుపులను కూడా తట్టి సూడుండ్రి.

ఒకాయినె గీ తలుపులను శేసిండు. ఎవలన్న వత్తే, గా తలుపునే నేరుగ తీత్తం. ఇగ గట్ల కాకుండా, గా తలుపులకే కిటికీలు పెట్టిండు. ఇగ ఎవలన్న గా తలుపు కొట్టంగనే గా డోర్ కి పైన పెట్టిన కిటికీని తీయాలె. గా కిటికీల కెల్లి సూడాలె. ఐటెంక అవసరమైతేనే తలుపు తెరవాలె. ఒకేల ఎవలన్నా అనుమానం వత్తే యెంటనే గా కిటికీ గూడ మూయాలె. పోలీసోల్లకు పోను శేయాలె. ఓ అన్న శేసిన గీ ఉపాయం మంచిగనే ఉంది కదా?

