Friday, September 18, 2026
26.4 C
Hyderabad

రైతు భరోసా పైన అసెంబ్లీలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సభలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రబుత్వం చేసిన ప్రకటనపైన పలు ప్రశ్నలు లెవనెత్తారు. ఈ ప్రభుత్వం చర్చ సందర్భంగా రైతు భరోసా విషయంలో కోతల విధించేందుకు పీఎం కిసాన్ విధివిధానాల గురించి ప్రస్తావించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పండించిన పంటలకే రైతు భరోసా అంటూ కోతలు విధించే ప్రయత్నం చేస్తుందన్నారు. సాగు చేసే భూములకు మాత్రమే రైతుబంధు ఇస్తామని చెప్పడం వల్ల అనేక మంది రైతులు రైతు భరోసాని కోల్పోతారని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల మూడు పంటలు కూడా పండిస్తారు.. మరి మూడుసార్లు రైతుబంధు ఇస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలని కోరారు. సంవత్సారానికి ఒకే పంటగా ఉండే పత్తి పంటకు రెండు సార్లు ఇస్తారా..ఇవ్వరా.. అనేది చెప్పాలన్నారు. పామ్ అయిల్ లాంటి వాణిజ్య పంటలతోపాటు… జామా, మామిడి వంటి ఉద్యాన వన పంటలకు రైతు భరోసా ఉంటుందా లేదో స్పష్టం చేయాలన్నారు. రైతు భరోసాపైన ఈరోజు సభలో ప్రభుత్వ నిర్ణయం చెప్పకుంటే చర్చ పెట్టి ఏం లాభం అన్నారు.

రైతు భరోసాపైన ముందు నుంచే కుట్రలు

రైతు భరోసా కోసం బడ్జెట్లో కేటాయించింది కేవలం. రూ.15,075 కోట్లు.. 70 లక్షల మంది రైతన్నలకు 1.53 కోట్ల ఎకరాల చొప్పున ప్రతి సీజన్లో 15000 ఇవ్వాలి అంటే రూ.23 వేల కోట్లు అవసరమని కానీ 15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కోతలకు సిద్ధపడిన తర్వాతనే ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది అనేది సుస్పష్టంమన్నారు. రైతుబంధు నెత్త కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే టైం పాస్ చేస్తున్నారు. ఆరోజు హామీలు ఇచ్చినప్పుడు అందరికీ అన్ని అని చెప్పి ఇప్పుడు కొందరికి కొన్ని అని చెప్తున్నారు. ఇప్పుడు కోతల పేరుతో కొత్త కథలు చెబుతున్నరన్నారు. రాష్ట్రంలో ఈరోజు పాన్ కార్డులు ఉన్నవాళ్లు కోటి యాభై లక్షల మంది ఉన్నారని, వారందరికీ రైతుబంధు కట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ అర్హతల ప్రకారం గ్రామాల్లోనూ ఐటీ చెల్లింపులు, పాన్ కార్డులు కలిగిన వ్యక్తులు, రైతన్నలు ఉన్నారు..వారందరికీ ఎగబెడతారా అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వమని చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు భూమి బంధం తెంపి వేస్తారా ,రైతు బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి అయితే తరతరాలుగా వాళ్లకి భూమితో ఉన్న బంధాన్ని తెంపివేస్తారా అన్నారు.

వేంటనే మంత్రి వర్గ ఉప సంఘం నివేదికను రాష్ట్రం ముందు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానా మొత్తం అంతా కర్షకుడే మింగేసినట్లు గోరంతలు చేసి ప్రాపకండా చేస్తున్నారు గుట్టలకు, పుట్టలకు రైతుబంధు అని చెప్పి అనేక కట్టు కథనాలు రాయించారన్నారు. నాడు రేవంత్ రెడ్డి చెప్పినట్లు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలన్నారు. రేవంత్ గతంలో కౌలు రైతులకు ఇవ్వాలి.. వారు వెయిట్ చేస్తున్నారన్నారు. నిన్న భూభారతిలో పెట్టిన అనుభవదారు కాలమ్ పెట్టినారు కాబట్టి వేంటనే 22 లక్షల మంది కౌలుదార్లకు రైతు భరోసా ఇవ్వాలన్నారు.

ఒక్కో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వ ఎకరానికి రూ. 17500..!బాకీ -కెటిఅర్

పోయిన యాసంగి 2500..నిన్న వానాకాలం 7500.. ఇప్పుడు యాసంగి 7500 రూ..!ఇలా మెత్తంగా ఒక్కో రైతుకు కాంగ్రెస్ ఎకరానికి 17500 బాకీ పడ్డదన్నారు. ఈ విషయాన్ని రైతులందరూ గుర్తుంచుకోవాలన్నారు. రెండు విడతల రైతు భరోసాతోపాటు, ఒక విడత 5000 వేలే ఇచ్చి ఎగ్గొట్టిన 2500 కలిపితే.. రూ.17500 మేర సుమారు 26,775 కోట్ల రూపాయలు రైతన్నలకు బాకీ పడింది. ఈ మెత్తం రైతన్నలకు ఇచ్చేదాకా మా పార్టీ వదిలపెట్టదన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు ఇచ్చిన హమీలను చర్చ సందర్భంగా కెటిఅర్ బలంగా ఎండగట్టారు. ఎన్నికలకు ముందుు ముష్టి పదివేలు ఎందుకు? ఎకరానికి 15వేల రైతుభరోసా.. ఇస్తామన్నారు, రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బందు ఇవ్వాలని ముచ్చట్లు చెప్పారనన్నారు. ఇప్పుడు తీసుకుంటే 5వేలు.. డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7500 అని ఎన్నికల సభల్లో చెప్పారని కానీ ఇప్పటిదాకా రైతుభరోసా వేస్తనేలేరన్నారు. అందుకే అంటున్నాం… రైతన్నలను తగ్గించకండి.. ఇదే కాంగ్రెస్ నేతలను రైతు బందు అపమని లేఖలు రాసినారని, ఎన్నికల కోడ్ వల్లన ఇయ్యలేక పోయాయని, అవే డబ్బులను ఒక్కసారి రైతులకిచ్చి, రెండుసార్లు ఎగవేసిందన్నారు. మార్పు మార్పు అని పేరు మార్చి రైతు భరోసా అని అవే 5వేలు ఇచ్చారన్నారు.

మా ప్రభుత్వం తెచ్చిన రైతుబందు దేశ వ్యాప్తంగా అనేక ప్రసంశలు

11 సీజన్లు.. 73 వేల కోట్లు.. రైతు ఖాతాల్లో నేరుగా సొమ్ము ఇచ్చామని తెలిపారు. మా ప్రభుత్వం తెచ్చిన రైతుబందు దేశ వ్యాప్తంగా అనేక ప్రసంశలు అందుకున్నదన్నారు. ఒడిషా..బెంగాల్..సహా అనేక రాష్ట్రాలు రైతుబంధు ను ఆదర్శంగా తీసుకొని నగదు బదిలీ పథకాలను ప్రవేశ పెట్టాయని తెలిపారు. కేంద్రంలోని బిజెపి కూడా మా రైతుబంధును కాపీ కొట్టి ప్రధానమంత్రికి పథకాన్ని ప్రారంభించింది కానీ పీఎం కిసాన్ లో అనేక కోతలను పెట్టిందన్నారు. అశోక్ గులాటీ .. అరవింద్ సుబ్రహ్మణ్యం.. రఘురాం రాజన్.. అభిజిత్ బెనర్జీ.. దేవిందర్ శర్మమ లాంటి ఎకనామిస్ట్ లు.. ఆగ్రో ఎకనామిస్టులు నుంచి.. ఐక్య రాజ్య సమితి దాకా అందరి ప్రశంసలు అందుకున్న స్కీం!. రైతును ఆదుకోవాడనికి.. వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి రైతబంధు తరహా పథకాలే మేలు అని ఆర్థికవేత్తలు.. వ్యవసాయ వేత్తలు ముక్తకంఠంతో చెప్పారు!

రైతు బందుపైన కాంగ్రెస్ బారీగా దుష్పచారం

రైతు బందుపైన కాంగ్రెస్ బారీగా దుష్పచారం చేసిందన్నారు. కానీ వాస్తవానికి నూటికి 98 శాతం.. బక్క రైతులే వున్నారు తెలంగాణలో ఉన్నారని, అందుకే.. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా.. ముందు వ్యవసాయ రంగం గాడిన పడేదాకా.. అందరికి ఇవ్వాలని ఒక పాలసీగానే నిర్ణయం తీసుకున్నామని కెటిఅర్ తెలిపారు. వ్యవసాయ రంగం స్ధిరీకరణ జరిగేదాకా బలోపేతం అయ్యేదాకా రైతుబంధు పైన ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్నారు. గతంలో రైతుబంధు పొందిన రైతన్నల్లో 98% బడుగు బలహీన చిన్న సన్నకారు వర్గాల రైతులే ఉన్నారని తెలిపారు. మహబూబ్నగర్ లాంటి జిల్లాలో 20-30 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా వలస కూలీలుగా వెళ్లే పరిస్థితి ఉండెదన్నారు. అందుకే రైతులకు రైతుబంధు ఆర్థిక సహాయం చేసినప్పుడు మేము ఎకరాలు అనే పరిమితులు ఏమి పెట్టలేదు. ముందుగా వ్యవసాయని బలోపేతం చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే రైతులందరికీ భూములతో పాటు పంటలతో పాటు సంబంధం లేకుండా అందర్నీ సమదృష్టితో చూసామని అందుకే మా ప్రభుత్వ హాయంలో ఆకలి కేకల నేల అన్నపూర్ణగా అవతరించిందిని, రైతు విలువ పెరిగిందన్నారు. మా హాయంలో భూమి విలువ పెరిగింది! సాగు సంబురమైందన్నారు.

10 ఎండ్లలో రైతుబంధు.. దుర్వినియోగం కాలేదుతెలంగాణ రైతు పచ్చబడితే కొందరి కళ్లు ఎర్రబడ్డాయి! అన్నదాత బాగుపడితే ఓర్వలేకపోయారు కొందరు అంటూ కాంగ్రెస్ పైన చురకలు వేశారు. వందల ఎకరాల పెద్ద రైతులకు లాభమని..పనిగట్టుకొని దుష్ప్రచారం చేసారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం! నూటికి 95 శాతం బక్క రైతులేఅని, రైతుబంధుతో చిన్న సన్నకారు రైతులకు ఇతోధికంగా మేలు జరిగిందన్నారు. ఈ సందర్భంగా కొన్ని లెక్కలను వివరించారు. 91.33శాతం లబ్ధి దారులు 5 ఎకరాలు కంటే తక్కువ భూమి వున్న చిన్న సన్నకారు రైతులే అని, 5నుంచి 10 ఎకరాలు వున్నమధ్య తరగతి రైతులు 7.28శాతం, 10 ఎకరాలు పైబడి వున్నవాళ్లు 1.39 శాతమే ఉన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమే ఉన్నారు. అయితే 72 వేల కోట్లరైతు బందులో కేవలం పెద్ద రైతులకు పోయింది కేవలం 1.39 శాతమే అని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. ఈ 80 శాతం లబ్ధిదారులు దళిత గిరిజన బహుజన రైతులే! ఉన్నారు (బీసీ- 54.. ఎస్సీ-13.. ఎస్టీ-13 శాతం) మెత్తం రైతు బందు నిధుల్లో 70 శాతం రైతుబంధు పైసలు బీసీ..ఎస్సీ..ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయన్నారు. పోడు భూములకు పట్టాలిచ్చి.. గిరిజన ఆదివాసీ రైతులకు సైతం రైతుబంధు పైసలు ఇచ్చామన్నారు. పోడు భూములకు రైతుబంధు ఇచ్చిన తర్వాత మొత్తం లబ్ధిదారుల్లో ఎస్సీఎస్టీబీసీ ల వాటా ఇంకా పెరిగిందన్నారు.

మట్టిని నమ్ముకొని బతికే రైతుకు ఎంత చేసినా..ఏమిచ్చినా తక్కువే అన్నది మా విధానమన్నారు. అన్నదాత విషయంలో కోతలు ఏగవేతాలు వద్దనుకున్నాం.. రైతుకు చేసే సాయం.. దానధర్మంగా చూడొద్దన్నారు. అన్నదాతకు ఇచ్చే భరోసాను భారంగా చూడవద్దు… భాద్యతగా చూడాలి. 47శాతం మంది ప్రజలకు వ్యవసాయ రంగమే ఉపాధి ఇస్తుందని గుర్తుంచుకోవలన్నారు. రైతన్నల బతుకుదెరువు బాగుండాలంటే.. పరిశ్రమలకు ఇచ్చినట్టే రైతుకు రాయితీలు.. ఇన్ పుట్ సబ్సిడీలు ఇచ్చి తీరాలని, పరిశ్రమలకు రాయితీల మాదిరే… రైతన్నల పంటకు కూడా ప్రొత్సాహకాలివ్వాలన్నారు. విత్తనం వేసిన నాటి నుంచి..పంట అమ్మేదాక రైతుకు ఎన్ని గండాలు..ఎన్ని కష్టాలుంటాయని, అందుకే ఏలాంటి పరిమితులు లేకుండా రైతు బందు ఇచ్చినమన్నారు.

కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు ఇచ్చిన హమీలను ఎండగట్టిన కెటిఅర్

కాంగ్రెస్ చెప్పిన బోనస్ బోగస్ అయింది

పండించిన ప్రతి పంటకు మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇస్తామని మ్యానిపెస్టోలో చెప్పారు. కాంగ్రెస్ మ్యానిపెస్టోలో చెప్పినట్టు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మార్పు అని ఊదరగొట్టింది కానీ చివరికి రైతుబంధును పేరు మార్చి రైతుబంధును రైతు భరోసాగా పేరు మార్చింది. ఇదేనా మీరు తేస్తామన్న మార్పు అని కెటిఅర్ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్ మీటింగ్ లోనే హామీలకు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైంది.. మరీ 12 నెలలైనా తొలి క్యాబినెట్ జరగలేదా.. లేక రాహుల్ అనుమతి రాలేదా అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసా లేదు రైతు భూమికి భరోసా అంతకన్నా లేదన్నారు. పొలంలో ఉండాల్సిన రైతులు జైళ్లలో ఉండాల్సి వస్తుందని, రైతన్న చేతికి సంకెళ్లు వేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ రుణమాఫీ పైన కెటిఅర్ సవాల్

రాష్ర్టంలో ఏ గ్రామంలో అయిన 100 శాతం రుణమాఫీ అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్న కెటిఅర్, ఇందుకోసం ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డి పల్లెకి అయినా వెళ్ధామన్నారు. మరోవైపు రుణమాఫీ కూడా చేస్తామని నమ్మబలికిందని, 49,500 కోట్ల రూపాయల నుంచి అవసరమైతే.. డెడ్ లైన్లు, అడ్డగోలు మాటలతో రుణమాఫీ ఎత్తగొడుతున్నారు. డిసెంబర్ 9 తేదీన.. ఏకకాలంలో 2 లక్షల మాఫీ అన్నారు,రేపే బ్యాంకులకు ఉరికురికి లోన్ తెచ్చుకోండని చెప్పారని, ఒక ఏడాది కడుపు, నోరు కట్టుకుంటే 40వేల కోట్లు కష్టంకాదన్నారు! మాఫీ చేయడం..ఈజీ అన్నారు. మొన్న జూన్ కేబినెట్ నిర్ణయాల్లో 31 వేల కోట్లు మాఫీ.. 47 లక్షల మందికి లబ్ధి అని ప్రకటించారు..!నిన్న బడ్జెట్ లో రూ.26వేల కోట్లు కేటాయించారు..! తీరా..ఆఖరికి తేలిందని, 17,934 కోట్లు రూపాయలు.. 22 లక్షల 37వేల 848 మంది రైతులకే రుణమాఫీ అని చెప్పారు. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదో అర్థంకాక.. లక్షలాది మంది రైతులు ఆందోళనలో ఉంటే.. కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుందన్నారు. రైతు భరోసాను ఎత్తగొట్టి రైతు రుణమాఫీ పేరిట చేసిన డ్రామా ఫెయిలైపోయిందన్నారు. ఏన్నికల ప్రచారంలో అందరికీ అన్నీ అన్నారు. ఇప్పుడు కొందరికే కొన్ని అని ఎందుకు కొంగజపం చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి తమ ఎమ్మెల్యేలకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి ముఖ్యమంత్రి 100% రుణమాఫీ అంటున్నారు.. ఎమ్మెల్యే 70 శాతం అంటున్నారు బయట రైతన్నలు మాత్రం 20% కూడా కాలేదు అంటున్నారు. లఘుచర్లలో రైతన్నలను జైలులో పెట్టినట్లుగా, అదానీ కోసము అన్నద్దమ్ముల కోసమో, అల్లుడి కంపెనీల కోసమో, బావమరిది అమృతం కోసం కాకుండా రైతన్నలకిచ్చిన హమీల అమలు కోసం పనిచేయాలని సిఎం కు విజ్ఞప్తి చేస్తున్నానని కెటిఅర్ అన్నారు.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News