Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

చమురు సంక్షోభానికి చేరువగా ప్రపంచ దేశాలు!|EDITORIAL

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం చమురు సంక్షోభానికి దారి తీస్తున్నది. ఈ యుద్ధం ఇతర గల్ఫ్‌ దేశాలకు వ్యాపిస్తే మాత్రం ప్రపంచ ఇంధనానికి జీవనాడి హర్మూజ్‌ జలసంధి మూతపడే ప్రమాదం కనిపిస్తున్నది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పున్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదో వంతు రవాణా అవుతుంది. అరేబియా మహా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్‌ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఇది. దీనిలో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోవిూటర్లు మాత్రమే ఉంటుంది. ఇరు దేశాలు ఇందులో అత్యధిక భాగం తమదే అని వాదిస్తున్నాయి. దీనిలో రెండు షిప్పింగ్‌ లేన్లు ఉన్నాయి. ఇందులో చాలా పెద్ద క్రూడ్‌ క్యారియర్లు సులువుగా ప్రయాణించగలుగుతాయి. ఒమన్‌ తీరం నుంచి నౌకలు పర్షియన్‌ గల్ఫ్ లోకి ప్రవేశిస్తాయి. చమురును నింపుకొని ఇరాన్‌ సవిూపం నుంచి హర్మూజ్‌ను దాటి బయటకు వస్తాయి.

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగు తున్నాయి. ఈ ప్రభావం భారత్ తో పాటు వివిధ గ్యాస్‌ కంపెనీలపై ఆర్థికంగా ఒత్తిడి పడుతుంది. ఐఐసీఐ సెక్యూరిటీస్‌ నివేదిక ప్రకారం ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 73 డాలర్ల నుంచి 74 డాలర్ల వరకు ఉన్నది. అదే సమయంలో అప్‌స్ట్రీమ్‌ కంపెనీల ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నది. ఇది గ్యాస్‌ కంపెనీలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఎల్‌ఎన్‌జీ ముడి చమురుకు సంబంధించింది. ముడి చమురు ధర పెరిగితే, ఎల్‌ఎన్‌జీ ధర సైతం పెరుగుతుంది. చమురు ధరల్లో ఈ పెరుగుదల ఇప్పటికీ 2025 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెరుగుదల కంటే తక్కువగా ఉంది. ప్రస్తుత పెరుగుదల గత నాలుగు సంవత్సరాల సగటు కంటే చాలా తక్కువ. ప్రస్తుతం, బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 75 డాలర్లుగా ఉన్నది. ఇది 2026 ఆర్థిక సంవత్సరానికి విశ్లేషకుల అంచనా 68 డాలర్ల కంటే కంటే దాదాపు 6-7 డాలర్లు ఎక్కువ. అయినప్పటికీ, ముడి చమురు ధరలు 2022-25 సగటు కంటే 9డాలర్లు తక్కువగా, 2025 ఆర్థిక సంవత్సరం సగటు కంటే 4డాలర్లు తక్కువగా ఉన్నది. డిమాండ్‌ లేకపోవడం మార్కెట్‌ పై ఆధిపత్యం చేస్తుంది.

అయితే, ఇంధన కంపెనీ స్టాక్స్‌ హెచ్చు తగ్గులను చూస్తున్నాయి. ఇది ప్రపంచ అనిశ్చితిల మధ్య మార్కెట్‌ ఆందోళనలను ప్రతిబింబిస్తున్నది. హార్ముజ్‌ జలసంధి ప్రపంచంలోని కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఇది పర్షియన్‌ గల్ఫ్‌, ఒమన్‌ గల్ఫ్ ను కలుపుతుంది. ప్రపంచంలోని చమురు రవాణాలో ఎక్కువ భాగం ఈ మార్గం గుండా వెళుతుంది. భారతదేశం చమురు దిగుమతుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో సగానికిపైగా హార్ముజ్‌ జలసంధి గుండా వెళతాయి. ఈ మార్గంలో ఏదైనా ఆటంకాలు ఎదురైతే.. భారత్‌ ఇతర వనరులు, మార్గాల కోసం వెతకాల్సిన అవసరం ఏర్పడుతుంది. భారత్‌ అవసరాలకు వాడే చమురులో 40 శాతం ఈ మార్గం నుంచే రవాణా అవుతోంది. ఇరాక్‌, సౌదీ, యూఏఈ, కువైట్‌, ఖతార్‌ నుంచి మనం దిగుమతి చేసుకొంటున్నాం. మన దేశం వినియోగించే ఇంధనంలో 90 శాతం వివిధ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకొంటున్నాం. హర్మూజ్‌ జలసంధి మూసుకుపోతే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతోపాటు రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. దీంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌ఎన్‌జీ ధరలకు రెక్కలు రావడం ఖాయం. దీంతో భారత ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి మళ్లీ దారుణంగా మారుతుంది. ఇప్పటికే వివిధ దేశాలతో మనకు ఉన్న చమురు ఒప్పందాలకు తోడు.. మనకు ఉన్న వ్యూహాత్మక నిల్వలు 74 రోజులకు సరిపోతాయి. ఇరాన్‌ ఎన్నడూ హర్ముజ్‌ జలసంధిని మూయలేదు. వాస్తవానికి టెహ్రాన్‌ ఉత్పత్తి చేసే చమురులో 80శాతం చైనా కొనుగోలు చేస్తుంది. హర్మూజ్‌ను మూస్తే, చైనా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుంది.

గతంలో ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం సమయంలో కూడా ఈ జలసంధి తెరిచే ఉంది. 1973లో ఈజిప్ట్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలపై నాడు సౌదీ అరేబియా, దాని మద్దతుదారులు చమురు వ్యాపారం నిలిపేశారు. కాకపోతే ఇప్పుడు అలాంటి నిర్ణయాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కొంతకాలం కిందటి వరకు అమెరికా అత్యధికంగా ఇంధనం దిగుమతి చేసుకొనేది. ఇప్పుడు అది కూడా భారీ ఎత్తున చమురును ఎగుమతి చేస్తోంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో ఐదో వంతుకు సమానం. సౌదీ, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ల నుంచి ఎగుమతి అవుతోంది.

ఇక లిక్విడ్‌ నేచురల్‌ గ్యాస్‌ రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. దీనిలో అత్యధికం ఖతార్‌ ఎగుమతి చేస్తుంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజ వణికిస్తోంది. దీన్ని గుర్తించిన అమెరికా బహ్రెయిన్‌లో తన ఫిఫ్త్‌ ప్లీట్‌ స్థావరాన్ని ఏర్పాటు చేసుకొంది. ఇక ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్‌ఎన్‌జీ అత్యధికంగా భారత్‌, చైనా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు ఎగుమతి అవుతోంది. 1980-88 వరకు జరిగిన ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం ప్రభావం జలసంధిపై పడింది. నాడు ఇరు దేశాలు పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు ట్యాంకర్లపై దాడులు చేసుకొన్నాయి. అందుకే దీన్ని ‘ట్యాంకర్‌ వార్‌’ అని కూడా అంటారు. ఆ సమయంలో వివిధ దేశాల పతాకాలపై ప్రయాణించిన దాదాపు 450కు పైగా నౌకలపై ఇరు దేశాలు దాడులు చేశాయి. తాజా యుద్ధం వల్ల ఈ జలసంధి మూసేస్తే పరిస్థితి దారుణంగా ఉండనుంది. ప్రధానంగా భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News