ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే సీఎం చంద్రబాబు, అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య వున్న వివిధ అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల గురించి చర్చించనున్నారని సమాచారం.

