Wednesday, September 23, 2026
22.5 C
Hyderabad

ఉగ్రమూకలను తుడిచి పెట్టడమే తక్షణ కర్తవ్యం|EDITORIAL

దేశ భద్రతను సవాలు చేస్తున్న ఉగ్రవాద శక్తులను సమూలంగా తుడిచి పెట్టకపోతే, అవి మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటన, ఫరీదాబాద్‌లో ఉగ్రసామగ్రి స్వాధీనం వంటి సంఘటనలు దేశమంతటా ఆందోళన కలిగిస్తున్నాయి. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మన దేశపు యువతను, చదువుకున్న వర్గాలను సైతం తమ వలలో వేసుకుని, మన వేళ్ళతో మన కళ్ళనే పొడిచిన విధంగా ఉగ్రదాడులకు తెగబడటం అత్యంత భయంకరంగా ఉంది. దేశంలోనే అంతర్గతంగా ఉగ్రశిక్షణనిస్తున్న, ఉగ్రవాదులుగా తయారవుతున్న వాళ్ళపై దృష్టి పెట్టి, గుట్టుమట్లు విప్పి పెట్టి, మట్టు పెట్టాల్సిందే! దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడం మన అందరి సమిష్టి బాధ్యత. తక్షణ కర్తవ్యం.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

దేశ భద్రతను సవాలు చేస్తున్న ఉగ్రవాద శక్తులను సమూలంగా తుడిచి పెట్టకపోతే, అవి మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటన, ఫరీదాబాద్‌లో ఉగ్రసామగ్రి స్వాధీనం వంటి సంఘటనలు దేశమంతటా ఆందోళన కలిగిస్తున్నాయి. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మన దేశపు యువతను, చదువుకున్న వర్గాలను సైతం తమ వలలో వేసుకుని, మన వేళ్ళతో మన కళ్ళనే పొడిచిన విధంగా ఉగ్రదాడులకు తెగబడటం అత్యంత భయంకరంగా ఉంది.

ఇంతకాలం పాకిస్తాన్‌ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశించి దాడులు చేస్తూ ఉండేవారు. తాజాగా మనవాళ్ళకే ఉగ్రవాద శిక్షణనిచ్చి, మనపైకే ఎగదోసి, మానవబాంబులై మన వాళ్ళనే హంతమొందిస్తున్నట్లుగా తాజా ఢిల్లీ పేలుళ్ళ ఘటన తేల్చేసింది. ఇది కేవలం మన భద్రతను మాత్రమేగాక, మన సామాజిక, మానసిక జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. దేశంలోనే అంతర్గతంగా ఉగ్రశిక్షణనిస్తున్న, ఉగ్రవాదులుగా తయారవుతున్న వాళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టి, గుట్టుమట్లు విప్పి పెట్టి, వాళ్ళని మట్టు పెట్టాల్సిందే.

పాక్‌లో ఉన్న మసూద్‌ అజర్‌ అనే ఉగ్రవాది జైషే మహమ్మద్‌ అనే సంస్థను స్థాపించి భారత్‌పై ఉగ్రదాడులు చేయించాడు. 2001లో పార్లమెంట్ పై దాడి, 2019లో పుల్వామా ఘటనకు కూడా అతడే కారణం. ఇప్పుడతని సోదరి సదియా కూడా మహిళా విభాగాన్ని నెలకొల్పి, మహిళలను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో పట్టుబడిన మహిళా వైద్యురాలు ఈ కుట్రలో భాగమని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు వైద్య సేవల ద్వారా ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు, ఇలాంటి ప్రాణాలు తీసే, విధ్వంసక రక్తపాత కార్యక్రమాల్లో పాల్గొనడం దేశానికి హానికరం.

ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ కగార్‌లాంటి భారీ శోధనను అంతర్గతంగా చేపట్టాలి. ఇల్లిల్లూ జల్లెడపట్టి గాలించి, ప్రతి అనుమానాస్పద వ్యక్తిని విచారించాలి. ఉగ్రవాద మూలాల తుడిచివేతకు గూఢచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. సరిహద్దుల్లోని చొరబాట్లను అడ్డుకోవడమే కాకుండా దేశంలోపల పాకిస్తాన్‌ మద్దతుతో పనిచేస్తున్న నెట్‌వర్క్ లను పూర్తిగా ధ్వంసం చేయాలి.

ఫరీదాబాద్‌ లో 2,900 కిలోల పేలుడు పదార్థం, రైఫిళ్లు, పిస్టళ్లు స్వాధీనం కావడం దేశానికి పొంచి ఉన్న ఉగ్ర ముప్పు గుట్టు విప్పింది. ఈ ఘటనల వెనుక జైషే మహమ్మద్‌, అన్సర్‌ ఘజ్వవత్‌ ఉల్‌ హింద్‌ సంస్థల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ సంస్థలు పాక్‌లో ఉన్నప్పటికీ, భారత్‌లో వాటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇస్లామిక్‌ టెర్రరిజం పేరుతో మతాన్ని వక్రీకరించి విధ్వంసకారక మార్గంలో నడిపిస్తున్నారు. ఇలాంటి వారిని ఏ కలుగుల్లో ఉన్నా పట్టి, ప్రత్యేక కోర్టుల ద్వారా తక్షణ శిక్షలు అమలు చేయాలి.

పహల్గాం హత్యాకాండ తర్వాత భారత సైన్యం పాక్‌పై దాడి చేసి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినా, పాక్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. సరికదా, వారు మరింత రెచ్చిపోయి దేశ వ్యతిరేక చర్యలను కొనసాగిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఎర్రకోట ఘటనే దీనికి నిదర్శనం. సాయంత్రం చోటుచేసుకున్న పేలుడు ఘటనకు కొద్ది గంటల ముందే ఫరీదాబాద్‌లో ఉగ్రవాద సామగ్రి పట్టుబడడం యాదృచ్ఛికం కాదు. ఇది పాక్‌ పన్నాగమేనని స్పష్టమవుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే అత్యవసర సమీక్షలు నిర్వహించి ఉగ్రవాదులపై కఠిన చర్యలకు హెచ్చరించారు. భూటాన్‌ పర్యటనలో ఉన్న మోదీ “ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టం” అని ప్రకటించడం, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. కానీ ప్రజలు కోరుకుంటున్నది కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం.
ఉగ్రవాదంపై యుద్ధం తాత్కాలికం కాదు. ఇది నిరంతర కర్తవ్యం. దేశంలోని ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం నుంచి సాధారణ ప్రజల దాకా అందరూ ఉగ్రవాద వ్యతిరేక శక్తులుగా మారాలి. పాక్‌పై మరలా కఠిన వైఖరిని అవలంబించకపోతే ఇటువంటి దాడులు మళ్లీ మళ్లీ జరుగుతాయి. భారత్‌తో పెట్టుకోవడానికి ఉగ్రవాదులకు ఉచ్చపడాలి.

దేశ భద్రత, ప్రజల ప్రాణాలు రాజకీయాల కంటే ముఖ్యమైనవి. ఈ దేశ గడ్డపై ఉగ్రవాదం మూలం మిగలకుండా అంతమొందించాల్సిందే. ఇస్లామిక్‌ తీవ్రవాదంపై ప్రత్యేక దృష్టి సారించి, దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడం మన అందరి సమిష్టి బాధ్యత. తక్షణ కర్తవ్యం.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News