Tuesday, September 15, 2026
25.7 C
Hyderabad

తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర భూమితో ముడిపడి ఉంది

“భూ భారతి” ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర భూమితో ముడిపడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. “భూ భారతి” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కొమురం భీమ్‌ గారి జల్, జమీన్, జంగిల్ కోసం చేసిన పోరాటం, సాయుధ రైతాంగ ఉద్యమం, కమ్యూనిస్టు నాయకుల పోరాటాలు అన్నీ భూమికోసమే సాగాయని గుర్తు చేశారు. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మారుస్తూ తెచ్చిన ధరణి వ్యవస్థ ప్రజల పాలిట ఒక భూతంలా మారిందని ఆరోపించారు. తహసీల్దార్‌లపై పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు వచ్చేలా వ్యవస్థను నాశనం చేశారని పేర్కొన్నారు. అప్పటి పాలకులు రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి తమ ప్రయోజనాలు సాధించారని విమర్శించారు. రికార్డుల పేరిట వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టడమూ జరిగిందన్నది నిరాకరించలేని వాస్తవమని చెప్పారు.

ఈ నేపథ్యంలో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో “భూ భారతి” ప్రాజెక్టును ప్రారంభించినట్టు సీఎం వెల్లడించారు. ఈ కొత్త ఆర్వోఆర్ చట్టం పేదల హక్కులను కాపాడేందుకే తీసుకువచ్చామని తెలిపారు. భూ భారతి ప్రాజెక్ట్‌ను పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో అమలు చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ప్రతి వ్యవసాయ భూమిని సర్వే చేసి, కొలతలు వేసి హద్దులు గుర్తించి, ఆధార్‌లాగే “భూధార్” అనే భూమికి సంబంధించిన ప్రత్యేక గుర్తింపు కార్డు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులదేనని, వారిని ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వం సంకల్పమని స్పష్టం చేశారు. గత పాలకుల్లా రెవెన్యూ అధికారులను అసెంబ్లీ సాక్షిగా దోషులుగా నిలబెట్టే చర్యలకు తాము వ్యతిరేకమని చెప్పారు. అవినీతిలో భాగమయ్యే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని, కానీ వ్యవస్థను మాత్రం తాము దెబ్బతీయబోమని స్పష్టంచేశారు.

కలెక్టర్లు ప్రతి మండలాన్ని పర్యటించి, చట్టం అమలులో చురుగ్గా పాల్గొనాలని ఈ వేదికపైనే ఆదేశాలిచ్చారు. రెవెన్యూ అధికారులపై వచ్చిన అపోహలను తొలగించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త భూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, రాష్ట్రంలో భూ వ్యవస్థను పారదర్శకంగా, న్యాయంగా మలచే దిశగా ఇది పెద్ద అడుగుగా సీఎం అభివర్ణించారు.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News