ప్రారంభించనున్న సీఎం, మంత్రి వర్గం
సమీక్ష చేసిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రజా భవన్ లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం పై డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ,ఎస్టీ , మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ లు ప్రితం ,బెల్లయ్య నాయక్ ,ఒబేదుల్ల కొత్వాల్, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాల రూపకల్పనపై చర్చించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభం కానున్న రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ ల ప్రక్రియ ఎలా సాగాలనే విషయం చర్చలు జరిపారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశమని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పరచడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

