తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, కేపి వివేకానంద తదితరులు కలిసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి స్పీకర్ పై ఏక వచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఈ సస్పెన్షన్ అక్రమం, అన్యాయం అని, ఆయన సభ సంప్రదాయాలు ఎక్కడ ఉల్లంఘించలేదని చెప్పారు. వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు.

