Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే యశస్విని శంకుస్థాపన

పాలకుర్తి సోమన్నకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

పెద్ద వంగర మండలం, పోచారంలో ఇందిరమ్మ ఇండ్లకు, రాయపర్తి మండలం కొండూరులో బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన

రాయపర్తి మండలం కేశవపురంలో పల్లె దవాఖాన ప్రారంభం

పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారుల పూర్ణకుంభ స్వాగతం పలికి, స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వదించారు.

పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో పెద్దవంగర, రాయపర్తి, తొర్రూరు మండలాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెద్దవంగర మండలం పోచారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి, అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…. ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వసతులతో కూడిన గృహ నిర్మాణానికి ఈ ఇండ్లు బలమైన పునాది కానుందని తెలిపారు.

ఇక రాయపర్తి మండలం కొండూరులో కొండూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నుండి మైలారం వరకు కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రహదారులు మెరుగుపడితే గ్రామస్తుల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

ఆ తరువాత రాయపర్తి మండలం, కేశవపురం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని (పల్లె దవాఖాన) ప్రారంభించి, గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు.ఆయా కార్యక్రమాల్లో అధికారులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News