పేమకు సాటి లేదు. పగకు పాటి లేదు. ఒక కుక్కపల్లి, చిరుత పులిల గీ ముచ్చట గిదీన్నే రుజువు శేసింది. పిల్లికి చెలగాటం, ఎలుకకు పాణ సంకటం అన్నట్లు… పులికి చెలగాటం.. కుక్కకు పాణ సంకటం.. శివరకు గా పులిపిల్ల పాణం మీదికే తెచ్చింది. మరి గదేందో తెలుసుకుందామా?

మహారాస్ట్రల బీడ్ జిల్లల గిది జరిగింది. గా అడవికి దగ్గర్ల ఉండే దవులావడ్గావ్ ఊరిల సోమారం పొద్దుగాల ఒక కుక్క పిల్లను చిరుత సంపింది. ఇగ గదే దినాన సీకటి పడకముందే, గా సచ్చిన కుక్క పిల్ల తల్లి కుక్క, ఏడాది వయసున్న ఓ చిరుత పిల్లపై దాడి శేసి సంపేసింది. గిదీంతోటి గా ఊరోల్లు మస్తు భయపడతాండ్రు. గా అడువులను సూసే అధికారులకు గీ ముచ్చటను శేరేసిండ్రు. ఇగ గావాల్లు గాడికి శేరుకుని, సూత్తే, గా చిరుత పిల్ల పీనుగకు కొంత దూరంలనే గా కుక్క పిల్ల పీనుగ కూడా కనబడ్డది. గిదీన్ని తల్లి పేమతో కుక్క పిల్ల శేసిన పతిదాడిగనే ఉన్నదంటాండ్రు గా అధికారులు. ఇగ గిదిప్పుడు నెట్టింట్ల తెగ వైరలైతాంది.

