పాలకుర్తికి వెళ్తుండగా జరిగిన ఘటనపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే యశస్విని
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం పాలకుర్తికి వెళ్తుండగా … జనగామ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తక్షణమే తన వాహనాన్ని ఆపి గాయపడిన వారి వద్దకు వెళ్లి వారికి ఏమైనా గాయాలు అయ్యాయా… అని తెలుసుకొని తానే స్వయంగా 108 కు ఫోన్ చేసి ఆ సంఘటనలో గాయపడి వున్న క్షతగాత్రులను తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, అటుగా వస్తున్న వారి సహాయంతో వారిని 108 అంబులెన్స్ లో ఎక్కించి వారికి తక్షణమే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జనగామ ఏరియా హాస్పిటల్ వైద్యులకు ఫోన్ చేసి ఆదేశించారు.

