SHOPPING|షాపింగ్ కి వెళ్లడం కన్నా జనం ఇప్పుడు ONLINE|ఆన్లైన్ లోనే కొనుగోలు చేయడానికి అలవాటు పడ్డారు. అందుకు తగ్గట్లు ఆన్లైన్లో ఆకర్షణీయమైన తగ్గింపు ధరలు, ఇతర ప్రయోజనాలు ఉండటం కూడా ఇందుకు కారణం. ఇదే సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్లు మోసాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. మీ డబ్బు మీకు సంబంధించిన సమాచారం సంతోషాలను కాపాడి నిలుపుకోవడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ మీ కోసం :
మోసగిస్తారు ఇలా…
- మీ ఖాతా సస్పెండ్ అయిందని చెప్పే సందేశాలు
- మీరు చేయని కొనుగోళ్లపై వెరిఫై చేయాల్సిందిగా వచ్చే సందేశాలు
- మీకు గిఫ్ట్ వచ్చింది వెంటనే స్పందించకపోతే మీ ఆర్డర్ రద్దు అవుతుంది అనే సందేశం
- గిఫ్ట్ కార్డులను పంపిస్తాం కావాల్సిన వివరాలు ఇవ్వండి అనే మెసేజ్ లు
- సాధారణంగా ఈ ఆన్లైన్ మోసాలన్నీ ఈమెయిల్, ఎం ఎం ఎస్, ఇతర మెసేజింగ్ యాప్ లు, ఫోన్ల ద్వారా జరుగుతూ ఉంటాయి. పేరున్న బ్రాండ్, ఈ కామర్స్ సేవా కేంద్రం నుంచి మాట్లాడుతున్నట్లు కూడా మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు.
ఈ మోసాల బారిన పడకుండా మనమేం చేయాలి?
మీకు వచ్చే మెసేజ్ ల లింకులను తొందరపడి ఓపెన్ చేయొద్దు. క్లిక్ చేసే ముందు కొద్దిసేపైనా చేయాలా? వద్దా? అని ఆలోచించండి.
- సాధారణంగా కొనుగోలు యాప్ సంస్థలు, బ్యాంకులు, మీ బ్యాంకుల వివరాలు అడగవు.
- అలాగే అత్యవసరంగా స్పందించమని చెప్పవు.
- ఒకవేళ మీరు చేసిన ఆర్డర్ ఎక్కడ వరకు వచ్చింది? అని తెలుసుకోవాలనుకుంటే, మీరు ఆర్డర్ చేసిన కంపెనీ వెబ్సైట్లో సంప్రదించండి. బయటి నుండి వచ్చిన లింకులను కాదు.
- చెల్లింపులను కూడా అధికారిక వెబ్సైట్ లేదా యాప్ లో మాత్రమే జరపండి
- గిఫ్ట్ కార్డులు ఇస్తామంటూ చెప్పే వారి మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మ వద్దు.
- మీరు మీ ఆన్లైన్ షాపింగ్ ఖాతాల కోసం బలమైన ప్రత్యేకమైన పాస్వర్డ్లను మాత్రమే వాడండి. రెండు లేదా మూడు అంచల భద్రత పద్ధతిని పాటించడం బెటర్.
- ఒకవేళ మీరు మోసపోయినట్లు గ్రహిస్తే, తక్షణమే అందుబాటులో ఉన్న సైబర్ పోలీసులను సంప్రదించండి ఫిర్యాదు చేయండి.

