Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

KCR|కేసీఆర్ FAMILY|కుటుంబ STORY|కథా MOVIE|చిత్రం!?

అసలు విభేదాలు ఉన్నట్లా? లేనట్లా?
ఉన్నా సద్దుమణిగినట్లా?
సర్దుకుపోయినట్లా?
నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్!

బిడ్డ ఎప్పుడో ఓ లేఖ రాస్తుంది. తర్వాత తన కొడుకు డిగ్రీ కాన్వొకేషన్ కోసం AMERICA|అమెరికా వెళుతుంది. ఆమె ఇండియాకు వచ్చే ముందు రోజే తండ్రికి రాసిన ఆ లేఖ LEAK|లీక్ అవుతుంది. AIRPORT|ఎయిర్ పోర్టులోనే విలేకరులతో మాట్లాడుతూ, నా తండ్రి దేవుడు. ఆయన చుట్టూ దయ్యాలున్నాయని అమెరికా నుంచి తిరిగి వచ్చిన బిడ్డ తీవ్రంగా ఆరోపిస్తుంది. కొడుకు తండ్రిని కలుస్తాడు. ఈలోగా IMPORTENT|ఇంపార్టెంట్ మీటింగ్ కోసం కొడుకు అమెరికాకు వెళతాడు. మేనల్లుడు వెళ్ళి అదే పనిగా మామతో చర్చిస్తాడు. బిడ్డకు ఆ తండ్రి కనీసం APPOINTMENT|అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడు. పోనీ ఏ విధంగానూ స్పందించడు. కానీ ఇద్దరు దూతలు బిడ్డతో చర్చిస్తారు. తర్వాత KALESHWARAM|కాళేశ్వరం అవినీతిపై విచారణ చేస్తున్న COMMISSION|కమిషన్ తన తండ్రికి ఇచ్చిన నోటీసులకు స్పందించిన తీరుపై మండిపడుతుంది. ఆయనకు NOTICE|నోటీసు ఇవ్వడమంటే తెలంగాణకు ఇవ్వడమేనని, తన తండ్రిపై ఈగ వాలినా ఊరుకోబోమని హెచ్చరిస్తుంది. తండ్రికిచ్చిన నోటీసులపై 4వ తేదీన మహాధర్నాకు పిలుపునిస్తుంది. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంది. అల్లుడు కాళేశ్వరంపై PPT|పీపీటీకి PREPARE|ప్రిపేర్ అవుతాడు. తండ్రి సర్కార్ తనకు ఇచ్చిన నోటీసులపై ఆ సర్కార్ నే ఇరుకున పెట్టే విధంగా సిద్ధమవుతాడు. కట్ చేస్తే, కథ అర్థమయ్యే ఉంటుంది. తండ్రి మాజీ సీఎం, బిడ్డ ఎమ్మెల్సీ, కొడుకు, మేనల్లుడు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇదీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ ఎదుట హాజరు కావాలని నోటీసు ఇచ్చిన నాటి నుంచి జరిగిన కుటుంబ కథా చిత్రం. మే 20న నోటీసులివ్వగా, 22న లేఖ లీక్ అయింది. ఇక అప్పటి నుంచీ BRS|బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలో సస్పెన్స్ థ్రిల్లర్ ను మించి సినిమా స్టైల్ లో జరిగిన తంతు ఇది. మరోసారి కట్ చేస్తే, తర్వాత ఏం జరిగిందనేది? అసలు క్లైమాక్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ తెరపై చూడాల్సిందే!

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై నియమితమైన జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన నాటి నుండి కేసీఆర్ కుటుంబంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనాలకు వారి కుటుంబ విభేదాలను వదిలేసి, వారు మాత్రం నోటీసులపై స్పందించాల్సిన తీరుపై ప్రిపేర్ అయ్యారు. నిజానికి అందులో తప్పు లేదు. కార్యాచరణ కూడా చేపట్టారు. కమిషన్ తనకిచ్చిన నోటీసులే తప్పని నిరూపించేలా కేసీఆర్ ఉద్దండులతో చర్చించి సంసిద్ధమయ్యారని తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరంతో తప్పులే జరగలేదని నిరూపించే వివరాలతో ఆయన రెడీ అయ్యారట. ఇక ఇదే అంశంపై అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పీపీటీ ఇవ్వనున్నారు. తద్వారా ప్రజల్లో ఈ విషయమై తాము చెప్పదలచుకున్నదే ప్రచారం అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారట. ఇదిలా ఉండగా, కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యే రోజున భారీ ఎత్తున పార్టీ తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, కేడర్ మొత్తాన్ని కేంద్రీక్రుతం చేయాలని నిర్ణయించారట. అసలు అది కాళేశ్వరం కమిషనే కాదని, కాంగ్రెస్ కమిషన్ అనే తీరులో ప్రజల్లోకి బాగా తీసుకుపోయేలా ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే కమిషన్ నోటీసుల తర్వాత జరిగిన కుటుంబ పరిణామాలపైనే ప్రజలు, మీడియా, పార్టీలో చర్చ జరిగేలా కేసీఆర్ జాగ్రత్తపడ్డారు. అలాగే పార్టీ కేడర్ నోరు విప్పవద్దని కూడా హుకుం జారీ చేశారు. దీంతో లిక్కర్ స్కాంలో కూరుకుపోయిన కవిత పరువును పదింతలు పెంచి, అమెను కడిగిన ముత్యంలా మరోసారి ప్రజల ముందు నిలిపేందుకు ఈ ఘటనను ఉపయోగించుకున్నారని రాజకీయంగా చర్చ జరుగుతోంది. అలాగే పార్టీలో ఆమె ప్రాధాన్యాన్ని మరోసారి అమాంతం పెంచేందుకు కూడా ఈ ఘనను వాడుకున్నారని తెలుస్తోంది.
కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులపై, కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై ఎలాంటి చర్చ జరగకుండా జాగ్రత్త పడ్డారని కూడా ప్రచారం జరుగుతోంది. పైగా ఈ సమయాన్ని కాళేశ్వరం కమికషన్ పై, ఆ నోటీసులు రావడానికి కారణమైన కాంగ్రెస్ పై ఎదురు దాడి చేయడానికి అస్త్ర, శస్త్రాలు తయారు చేసుకోవడానికి ఈ సమయాన్ని వాడేశారట. లేని తమ కుటుంబ గొడవలను జనం మీదకు వదిలి, జనాన్ని అందులో గోల్ గోల్ చేసేశారని ఆ పార్టీ శ్రేణులో అక్కడక్కడా చర్చించుకుంటున్నారు.

నిజానికి, ప్రజల్ని మెప్పించలేనప్పుడు, ఒప్పించలేనప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నట్లు చేసి, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడం రాజకీయ పార్టీలకు అలవాటే. చివరకు ఆ ప్రజలే వాళ్ళ దగ్గరకు వెళ్లి, మీరు ఇలా కొట్టుకోవడం బాగా లేదు. మీరు మంచిగుండాలని అడగేలా చేసుకోవడం ఇలాంటి టక్కు టమార ట్రిక్కులలో దాగి ఉన్న ముఖ్యాంశం.
గతంలో విప్లవ గ్రూపుల మధ్య విభేదాలతో ఒకరినొకరు చంపుకునే వారు. దీంతో కార్యోన్ముఖులు కావాల్సిన ప్రజలు ప్రేక్షకులుగా మిగిలేవారు. నిజానికి ప్రజలు కార్యోన్ముఖులు అయ్యే విధంగా చేయడమే రాజకీయ పార్టీలు, విప్లవ సంస్థల పని. కానీ ప్రేక్షకులుగా మిగిల్చి తమను తాము ఎలివేట్ చేసుకోవడం కూడా రాజకీయమే. ఇలాంటివన్నీ ఇందులో భాగమే అనుకోవాలి.

అంతర్గత కుమ్ములాటలు ప్రజలను అయోమయంలోకి, అస్పష్టతలోకి నెడతాయి. మీరు ఏం చేశారు? ఎంత త్యాగం చేశార? న్నది అప్రస్తుతం. విషయమేంటంటే ప్రజలు పార్టీల లేదా తమ నాయకత్వాన్ని నడకను, నడవడిని, వారి మాటని కూడా సునిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఆ మాటల సారాంశాన్ని అర్థం చేసుకంటూ, విశ్లేషించుకుంటూ ఉంటారు. మీ మీద మీకే, సమాజం గురించి కూడా స్పష్టత లేని వారు మాకు ఏ విధంగా నాయకత్వం వహిస్తారని అనుమానాల్లోకి నెట్టబడి చింతాక్రాంతులవుతారు. ఇలాంటి అయోమయాన్ని ప్రజలకు కల్పించడం కూడా ఇందులో భాగమే అనుకోవాలి.

ఒక రకంగా తమకు ఓట్లు వేయని ప్రజల మీద పార్టీలు ఇలా అక్కసును, ప్రతీకారాన్ని తీర్చుకుంటాయని అపర రాజకీయ చాణక్యుడు చెప్పిన రాజనీతి సూత్రం ఇదేనట.

ఏతావాతా… ఏదో సాధిస్తారని, తమకేదో ఒరగపెడతారని, ప్రజలు పరిపాలకులను ఎన్నుకుంటారు. కానీ ప్రజల ఆశలు, ఆశయాలకు, ఆకాంక్షలకు భిన్నంగా గత పాలన సాగింది. దీంతో ప్రజలు వారిని తిరస్కరించారు. మమ్మల్ని తిరస్కరించిన ప్రజలు తిరిగి మమ్మల్ని ఆశ్రయించేదాకా వదిలి పెట్టమని నిర్ణయించుకున్నట్లుగానే కేసీఆర్ కుటుంబ గొడవలను చూడాలా? ఎందుకంటే కేసీఆర్ ‘దున్నపోతుకు గడ్డేసి, బర్రెను పాలివ్వమంటే ఎలా?’ అనే పదే పదే అంటున్నారు. కాబట్టి ప్రజలు నిర్ణయించుకోవాలి.

సాధారణంగా కుటుంబంలో జరిగేదే ఇది. కుటుంబం లక్షణం. ఇంట్లో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు చేసే వ్యవహారమే ఇది. దీంతో అంతా కలిసి ఆ సాధించే వ్యక్తిని బుజ్జగించడం ఆనవాయితీ. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే చేస్తోంది.

పోరాటాలు చేయడం, ఉద్యమాలు నడపడం, ఎత్తుగడలు వేయడం, ఎదుటి వారిని చిత్తు చేయడం, పరిపాలించడం, అన్నీ తెలిసిన కేసీఆర్ కు, కేటీఆర్ కు, కవితకు, హరీశ్ రావుకు మాట్లాడుకోవడం, సమీక్షించుకోవడం, చర్చించుకోవడం, నిర్ణయించుకోవడం వంటివేవీ తెయవనుకోవాలా?

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News