Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

కొంగ జపం శాంతి తపం!?|EDITORIAL

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిజమేనా? అసలా చర్చలు దౌత్య నాటకమా? నిజమైన పరిష్కార ప్రయత్నమా? మధ్యప్రాచ్యంలోని తాజా ఉద్రిక్తతలను పరిశీలిస్తే ఈ ప్రశ్న తలెత్తక మానది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న వ్యూహాత్మక పోరు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.

అణు ప్రయోగం చుట్టూ తిరుగుతున్న వివాదమే ఈ సంక్షోభానికి కేంద్ర బిందువు. ఇరాన్ యురేనియం శుద్ధి, భవిష్యత్తులో అణ్వాయుధాల తయారికి దారితీస్తుందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం కఠిన ఆంక్షలు విధిస్తూ, ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు, ఇరాన్ తన సార్వభౌమ హక్కులను వదులుకోలేదని స్పష్టం చేస్తోంది. ఈ భిన్న వైఖరుల వల్ల శాంతి చర్చలు సాగడం కష్టంగా మారింది.

గల్ఫ్ లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ అంచనాల ప్రకారం, రోజుకు 10–15 మిలియన్ బ్యారెల్స్ వరకు సరఫరా ప్రభావితమవుతున్నట్లు భావిస్తున్నారు. ఇది గ్లోబల్ ఉత్పత్తిలో 20%–30% వరకు ప్రభావం చూపగలదు. ఇందులో హార్మూజ్ జలసంధి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ జలసంధి గుండా జరుగుతుంది. ఇక్కడ ఏ చిన్న అంతరాయం జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు కుదేలవుతాయి.

ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు సైనిక సమీకరణలు పెరగడం అనుమానాలకు తావిస్తోంది. అమెరికా నౌకాదళం గల్ఫ్ ప్రాంతంలో తన బలగాన్ని పెంచడం, ఇజ్రాయిల్ తరచూ భద్రతా హెచ్చరికలు జారీ చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏమిటీ “డబుల్ గేమ్”? అనే విమర్శలు వినిపించడం సహజం.

అయితే, అంతర్జాతీయ దౌత్యంలో ఇది కొత్త విషయం కాదు. చర్చలతో పాటు ఒత్తిడి తంత్రాలను ఉపయోగించడం అనేది చాలా దేశాలు అనుసరించే వ్యూహమే. మరైతే, ఆ ఒత్తిడి నిజంగా శాంతికి దారి తీస్తుందా? లేక మరింత ఘర్షణలకు కారణమవుతుందా?

ఆంక్షలు ఎత్తివేయకుండా ఎలాంటి ఒప్పందానికీ సిద్ధంగా లేదని ఇరాన్ వైఖరి స్పష్టం చేస్తోంది. యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా డిమాండ్‌పై ఇరాన్ గట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశం చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం, 15–20 సంవత్సరాలపాటు శుద్ధి నిలిపివేయాలని అమెరికా కోరుతుండగా, ఇరాన్ దాన్ని తిరస్కరిస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ ఉద్రిక్తతల ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కావడం లేదు. ఇండియా, చైనా వంటి దిగుమతి ఆధారిత దేశాలు ఇంధన ధరల పెరుగుదలతో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చమురు ధరలు బ్యారెల్‌కు 80–100 డాలర్ల మధ్య ఊగిసలాడే పరిస్థితి ఏర్పడితే, అభివృద్ధి చెందుతున్న దేశాలపై దాని ప్రభావం మరింత తీవ్రమవుతుంది.

ఇక శాంతి చర్చల విశ్వసనీయతపై కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు చర్చలు జరుపుతూనే, మరోవైపు ఆంక్షలు, సైనిక చర్యలు కొనసాగితే పరస్పర నమ్మకం ఎలా ఏర్పడుతుంది? ఇరాన్ నేతలు ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. చర్చలు ఫలప్రదం కావాలంటే ముందుగా నమ్మకం అవసరం. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలు కొనసాగితే శాంతి ప్రయత్నాలు విజయవంతం కావడం కష్టం.

చరిత్ర కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. గతంలో ఇరాక్ యుద్ధ సమయంలో రసాయన ఆయుధాల ఆరోపణలతో యుద్ధం ప్రారంభించి, తరువాత అవి లేవని తేల్చిన విషయం తెలిసిందే. అలాంటి అనుభవాలు ప్రస్తుత పరిస్థితులపై అనుమానాలను పెంచుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితి మరింత సున్నితంగా మారింది. ఒక చిన్న తప్పిదం పెద్ద ఘర్షణకు దారితీయవచ్చు. శాంతి చర్చలు నిజంగా ఫలించాలని ఉంటే, రెండు పక్షాలూ తమ గరిష్ట డిమాండ్ల నుంచి కొంత వెనక్కి తగ్గాల్సిందే. లేకపోతే ఈ దౌత్య నాటకం కొనసాగుతూనే ఉంటుంది. ప్రపంచం మాత్రం తమ ప్రమేయం లేకుండానే, అస్థిరత భారానని మోయాల్సి వస్తుంది.

ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే, శక్తి ప్రదర్శన కంటే నమ్మకం, పరస్పర గౌరవం, సమన్వయం ముఖ్యం. లేదంటే “శాంతి చర్చలు” కేవలం రాజకీయ నినాదంగానే మిగిలిపోతాయి.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News