Sunday, September 20, 2026
26.7 C
Hyderabad

Telangana|తెలంగాణలో లోకల్‌ బాడీ|Local Body ఎన్నికలకు| Elections బ్రేక్‌|Break

Shock|షాక్‌ ఇచ్చిన హైకోర్టు|High Court

BC Reservations|బీసీ రిజర్వేషన్లపై వివాదం,

STATE|రాష్ట్రవ్యాప్తంగా Protest|ఆందోళనలు తీవ్రం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు నిలిపివేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9పై స్టే విధిస్తూ, నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది.

జీవో నంబర్‌ 9 ద్వారా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే ఈ జీవో చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఎన్నికల ప్రక్రియపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.

విచారణ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి బీసీల జనాభాపై ప్రభుత్వ వైఖరిని సమర్థించారు. సర్వే ప్రకారం తెలంగాణలో 57.6 శాతం బీసీ జనాభా ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్యపై ఎవరూ అభ్యంతరం తెలపలేదు. పిటిషనర్లు ప్రభుత్వ రిపోర్ట్‌ను కోరడం అవసరం లేదు. బిల్లుపై ఏ పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. గవర్నర్‌ గడువులోగా ఆమోదించకపోయినా, చట్టం ఆటోమేటిక్‌గా అమలులోకి వస్తుంది. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేక నోటిఫికేషన్‌ అవసరం లేదని ఆయన వాదించారు.

అదే సమయంలో ఏజీ సుదర్శన్‌రెడ్డి మరో అంశాన్ని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు వేరు. రాజకీయ రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుంది. మేము రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో తెచ్చాం. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ విధానాన్ని అనుసరిస్తూ కుల వివరాలను జనగణనలో చేర్చేందుకు సిద్ధమవుతోంది అని ఆయన అన్నారు. అయితే హైకోర్టు ఈ వాదనలను పరిశీలించిన తరువాత నాలుగు వారాల పాటు విచారణను వాయిదా వేసింది.

ఈ తీర్పుతో బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగింది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీలకు పదవులు వస్తే ఓర్చుకోలేకపోతున్నారు. బీసీల నోటి కాడ ముద్దను లాక్కున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హెచ్చరిస్తూ ప్రభుత్వ స్పందన బట్టి తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తాం అని ప్రకటించారు.

ఇక హైకోర్టు తీర్పుపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనమైన జీవో ద్వారా బీసీలను మోసం చేశాడు. బీసీల హక్కులను చాటుకునే బదులు, రాజకీయ లాభాల కోసం జీవోను ఉపయోగించారు అని ఆయన ఆరోపించారు. తీన్మార్ మల్లన్న రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ కార్యకర్తలను ఆయన ఆదేశించారు. బీసీలను వంచించిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు. ఈ బంద్‌ బీసీల స్వాభిమాన పోరాటానికి నాంది అవుతుంది అని మల్లన్న పేర్కొన్నారు.

ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీసీ సంఘాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఈ విషయంపై మౌనం పాటిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.

రాబోయే రోజుల్లో హైకోర్టు విచారణలో ప్రభుత్వం తన వాదనలను సమగ్రంగా సమర్పించనుంది. ఈ నాలుగు వారాల్లో బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత, జీవో 9 అమలు, గవర్నర్‌ ఆమోదం, మరియు సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే బంద్‌ పిలుపుకు మద్దతు తెలిపిన సంఘాలు ఉన్నాయి. ఈ పరిణామాలు తెలంగాణలో రాజకీయ చర్చలకు కొత్త ఊపును తెచ్చాయి.

హైకోర్టు తీర్పు వల్ల బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తు మరియు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ రెండూ అనిశ్చితిలో పడ్డాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం చట్టపరంగా తన వైఖరిని సమర్థించగలదా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రశ్నగా మారింది.

Latest News

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News