నారాయణపురం మండలంలోని కంకణలగూడెంలో ఉదయం 5 గంటలకు ఓ ఇంటి తలుపు కొట్టారు కలెక్టర్ హనుమంతరావు. ఇంట్లో ఉండిన వ్యక్తి తలుపు తెరిచి చూడగా, ఆయనకు ఆశ్చర్యం కలిగింది. టెన్త్ విద్యార్థి భరత్ చంద్ర చదువులో మంచి ప్రగతి సాధించాలని కలెక్టర్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి, విద్యా పరిస్థితి గురించి ఆరా తీశారు.
భరత్ చంద్రకు చదువుకునేందుకు సౌకర్యంగా ఉండేందుకు ఒక చైర్, రైటింగ్ ప్యాడ్ బహుమతిగా అందించారు. అలాగే, అతని కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న హనుమంతరావు, టెన్త్ పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతి నెలా రూ. 5,000 ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన సహాయాన్ని అక్కడికక్కడే అందజేశారు.

