Thursday, September 24, 2026
22.2 C
Hyderabad

చట్టాలను చేస్తున్నవాళ్ళే వాటిని ఉల్లంఘిస్తున్నారా!?|EDITORIAL

ఒక విషయాన్ని ఎవరైనా సరే, వారి దృక్కోణం నుంచే చూస్తారు. ఆ విధంగానే స్పందిస్తారు. ఇది సాధారణం. కానీ, రాజకీయ నాయకులకు ఏది ఏ విధంగా, యధాతథంగా అర్థమైనా సరే, వారి మైలేజీని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు తీర్పు విషయంలోనూ ఈ విధంగానే స్పందించారు. నిజానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పెద్దగా కలిగించలనమేమీ కలిగించలేదు. తీర్పులో కొత్త విషయమేమీ లేదు. స్పీకరే నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యం మంచిది కాదు. త్వరగా నిర్ణయం తీసుకోండి. మూడు నెలల గడువులోగా అయితే మంచిది. ఫిరాయింపులపై పార్లమెంటు స్పందించాలి. అన్న సూనలే చేసింది. కోర్టు పరిధిలోనే సుప్రీం తీర్పుంది. సూచనలు సరే, సరి. ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడుతుందని బీఆర్‌ఎస్‌ గట్టిగా నమ్మింది. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ సహా, ఫిరాయంపుదారులు కొంత భయపడినా, అంతగా ఏమీ జరగలేదు. ఒక రకంగా తీర్పు రాజ్యాంగానికి లోబడి, తటస్థంగా ఉంది. అయితే ఈ తీర్పుపై ఎవరికి వారు తమకు అనుకూలంగా భాష్యాలు చెప్పుకున్నారు.

ఈ కోర్టు తీర్పులో చట్టాలను తయారు చేస్తున్న వారిని, సమీక్షించమని కోర్టు కోరింది. కానీ, ఆ చట్టాలను తయారు చేస్తున్న వాళ్ళే ఉల్లంఘిస్తున్న తీరు అత్యంత విషాదం. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. తమ పదేళ్ళ అధికారంలో టీడీఎల్పీని విలీనం చేసుకుని, కాంగ్రెస్ ను కకావికలం చేసి, కమ్యూనిస్టులను కూడా తమలో కలుపుకున్న బీఆర్ఎస్, ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చింది. కోర్టుకు వెళ్ళింది. నానా హంగామా చేసింది. గులాబీలను ఎవరూ పట్టించుకోలేదు. తీర్పులపై కూడా పెద్దగా ఆసక్తి కనబడలేదు. సుప్రీం తీర్పు వచ్చినా ప్రజల్లో చర్చ జరగలేదు. పైగా రాజకీయ పార్టీల అసలు రూపాలు ప్రజలకు అర్థమవుతున్న కొద్దీ రాజకీయ రంగంపైనే కాదు, నాయకుల మీద కూడా నమ్మకం సన్నగిల్లుతోంది.

ఇక కోర్టులు, వాటి తీర్పులపై రాజకీయ నాయకులకు, ఆయా పార్టీలకే కాదు బీఆర్ఎస్ కు కూడా విశ్వాసం ఉన్నట్లుగా ఎక్కడా కనిపించదు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల కేటాయింపునే తీసుకుంటే, ఉమ్మడి ఏపీలో వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయించారు. సుదీర్ఘ విచారణల తర్వాత చివరకు సుప్రీం కోర్టు జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు అప్పగించాలని ఆదేశించింది. ‘సుప్రీం’ చీఫ్‌ జస్టిస్‌ ఇచ్చిన ఆదేశాన్ని కూడా ఆనాటి కేసీఆర్‌ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆనాడు సుప్రీం తీర్పును పట్టించుకోని, ఆదేశాలను అమలు చేయని బీఆర్‌ఎస్‌ నేతలు, ఇప్పుడు సుప్రీం తీర్పుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు? తీర్పులను లెక్క చేయకపోవడం, చట్టాలను ఉల్లంఘించడం, అమలు చేయకపోవడం, అవినీతిలో కూరుకుపోవడం, కుటంబ సభ్యులకే పదవులు కట్టబెట్టుకోవడం వంటి అనేక అరచకాలను ఆనాడు ప్రజల అనుభవంలోనే ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతున్న మాట నిజం. ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉందన్న భ్రమల్లో బీఆర్ఎస్ ఉన్నట్లు ఉంది. పైగా జనం కాంగ్రెస్ కు ఓట్లు వేసి తప్పు చేశారని, వారే తిరిగి తమను గెలిపిస్తారని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపు తమదే అన్న ధీమాతో కూడా ఆ పార్టీ ఉండటంలో తప్పులేదు. కానీ, కాంగ్రెస్ వైఫల్యాలకంటే బీఆర్ఎస్ అవినీతే ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నది. అందుకే భా పార్టీని ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జాన్ అబ్రహం వంటి వారు ఆ పార్టీని వీడుతున్నారు. అంతకుముందే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కంగ్రెస్ లో కలిసిపోయారు. ఫిరాయింపు భయం ఎంతో కొంత లేకపోతే, ఏ పార్టీలో గెలిచినా, ఎమ్మెల్యేంతా అధికార పార్టీల్లోనే ఉండేవారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా కాపాడు కోవడంతో పాటు, పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని పార్టీ శ్రేణుల్లో నమ్మకం కల్పించేం దుకు కేసీఆర్ కుటుంబం నానా తంటాలు పడుతోంది. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఆశపడుతోంది. అందుకే 3నెలల తర్వాత ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది.

ఒకప్పుడు స్పీకర్లు పార్టీలకు అతీతంగా, న్యాయబద్ధంగా నడుచుకొనేవారు. వారి నిర్ణయాలు పార్టీలకు అతీతంగా చట్టాలకు నిబంధనలకు లోబడి ఉండేవి. కాలక్రమంలో స్పీకర్లు అధికార పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవడం మొదలుపెట్టారు. గత బీఆర్‌ఎప్‌ ప్రభుత్వ హయాంలో పాటించని నిబంధనల గురించి ఇవ్వాళ బిఆర్‌ఎస్‌ వాదిస్తోంది. స్పీకర్లు తమ స్వేచ్ఛను కోల్పోవడం వల్లే వారి అధికారాల్లో జోక్యం చేసుకోవాలని సుప్రీం గడప తొక్కుతున్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి సైతం పరిమితులు ఉన్నందున వివాదాలు సత్వరం పరిష్కారం కావడం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మరికొందరు పార్టీని వీడకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుకోగలిగింది. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఆ పార్టీకి ఆశాభంగం కలిగించింది. గడువులోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోతే, పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదనుకున్నా, చట్టసభలు-న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ తలెత్తరాదన్నా, పార్లమెంటు సమీక్షించాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. ఫిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యం కాకుండా సత్వర చర్యలు తీసుకోవాలి. చట్టాలు సక్రమంగా అమలు కావాలి. ఉమ్మడి ఏపీలో వైఎస్ 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకున్నారు. అప్పుడు నైతికం, అక్రమమని కేసీఆర్‌ ఆక్రోశించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక అదే పని చేశారు. రెండోసారి సీఎం అయ్యాక స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేశారు. స్పీకర్లు, పాలకులు, పార్టీలు చట్టబద్దంగా వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
…..

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News