Thursday, July 30, 2026
23 C
Hyderabad

మసూద్ అజార్ ది మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్!

అతను ఒక మామూలు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కొడుకు. 8వ తరగతిలోనే చదువుకు స్వస్తి పలికి, జామియా ఉలూమ్ ఇస్లామిక్ పాఠశాలలో చేరాడు, అలీమ్‌గా పట్టభద్రుడయ్యాడు. ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. ఈ అలీమే ఆతర్వాత అంతర్జాతీయ ఉగ్రవాది అయ్యాడంటే నమ్మడం కష్టమే. పాకిస్తాన్ తమ దేశ అధ్యక్షుడికంటే, ప్రధాని కంటే కూడా, అత్యంత సైనిక భద్రత కల్పించి రక్షిస్తున్నది కూడా ఇతడినే. అయితే భారత్ లో ఇప్పటి దాకా జరిగిన అన్నిదాడులకు ప్రధాన సూత్రధారి కూడా ఇతడే. అతడే ది మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మహమ్మద్ మసూద్ అజార్ అల్వి అలియాస్ మసూద్ అజార్.

హైదరాబాద్, మే 8 (అడుగు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి):
పాకిస్తాన్ లోని పంజాబ్‌లో గల బహవల్‌పూర్‌లో జూలై 10, 1968న పుట్టిన మహమ్మద్ మసూద్ అజార్ అల్వి అలియాస్ మసూద్ అజార్. మన దేశంలోనే (1994 ఫిబ్రవరిలో)అరెస్టై, జైలులో ఉండి, విమానం హైజాక్ ద్వారా (1999, డిసెంబర్ లో ) విడుదలై, మన పార్లమెంట్ మీదే (డిసెంబర్ 13, 2001న) దాడి చేయించిన కరడుగట్టిన టెర్రరిస్టు నాయకుడు కూడా ఇతడే. 2008 ముంబై దాడులు, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి, ఇలా భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (2000) వ్యవస్థాపకుడు. అది అతని కుటుంబ సంస్థ.

అయితే, భారతదేశం ఫిబ్రవరిలో అనంతనాగ్ సమీపంలోని ఖనాబాల్ నుండి అతన్ని అరెస్టు చేసింది. 1999 విమానం హైజాక్ నేపథ్యంలో జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు నుంచి విడుదలయ్యాడు. నేరుగా పాకిస్తాన్ కి వెళ్ళిపోయాడు. తమ దేశంలో అతడిపై ఎలాంటి అభియోగాలు లేనందున పాక్ కనీసం అతడిని అరెస్టు కూడా చేయలేదు. డిసెంబర్ 29, 2001న భారత పార్లమెంటుపై డాడి తర్వాత ఏడాదిపాటు గృహ నిర్బంధం చేసి, 2002 డిసెంబర్ 14న ఆ నిర్బంధాన్ని ముగించారు.

విడుదలైన కొద్దికాలానికే, అజార్ కరాచీలో 10వేల మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ” భారతదేశాన్ని నాశనం చేసే వరకు ముస్లింలు శాంతితో విశ్రాంతి తీసుకోకూడదని మీకు చెప్పడం నా విధి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ” అని ప్రకటించాడు, కాశ్మీర్ ప్రాంతాన్ని భారత పాలన నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

2008 ముంబై దాడుల తర్వాత అతను పాకిస్తాన్ పంజాబ్ లోని తన స్వస్థలం భవల్‌పూర్‌లో ఉంటున్నాడు. 2014 జనవరి 26న, రెండేళ్ళ ఏకాంతవాసం తర్వాత అజార్ తిరిగి కనిపించాడు. 2019 పుల్వామా దాడికి పాల్పడింది తమ సంస్థేనని పాక్ పకడ్బందీ ఆర్మీ రక్షణలోని బంకర్ నుండి ప్రకటించాడు. దీంతో అతడిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

ఇక అప్పటి నుంచి కనిపించడం మానేసిన మసూద్ అజార్, 2025 మే 7న, పహల్గామ్ దాడికి ప్రతీకారంగా , బహవల్పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ శిబిరంతో సహా, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణి దాడులు నిర్వహించింది . మసూద్ అజార్ తన సోదరి, మేనల్లుడు, మేనకోడళ్ళు, ఇతర దగ్గరి బంధువులతో సహా 14 మందిని కోల్పోయి, చావు మిగిల్చిన విషాదాన్ని అనుభవిస్తున్నాడా? లేక చావు దెబ్బ తిన్నాడా? సమీప కాలంలోనే బండారం అంతా బట్ట బయలవుతుంది.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News