Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

Supreme Court|సుప్రీంకోర్టులో Telangana Government|తెలంగాణ ప్రభుత్వానికి షాక్|Shock

BC Reservations|బీసీ రిజర్వేషన్లపై ఊహించని తీర్పు|Judgement

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 16 (అడుగు న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ (SLP)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కొనసాగనుంది. ఈ కేసుపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది.

సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా పలు ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. ఎస్టీ ప్రాంతాల్లో మాత్రమే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్వి వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని తెలిపారు. బిల్లుకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వాదించారు.

అభిషేక్ సింగ్వి మరింత వివరంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా, సాంకేతికంగా కుల సర్వే నిర్వహించిందని, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపిరికల్ డేటా సేకరించి, ఆ డేటా ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సమగ్ర సర్వే నిర్వహించాము. 94,000 మంది అధికారుల ద్వారా ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, కుల సర్వే చేశాము. ఈ డేటా ఆధారంగానే బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాము. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్వయంగా రిజర్వేషన్లకు డేటా ఆధారమే ముఖ్యమని స్పష్టం చేసింది అని వాదించారు. అలాగే గవర్నర్ బిల్లును పెండింగ్‌లో ఉంచడం వల్ల జీవో నంబర్ 9ను సవాల్ చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలను పరిశీలించిన తర్వాత హైకోర్టు తీర్పును మార్చడానికి ఆధారం లేదని తేల్చింది. షెడ్యూల్డ్ ఏరియాలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రిజర్వేషన్ పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించింది అని ధర్మాసనం స్పష్టం చేసింది.

మాధవరెడ్డి తరఫున వాదనలు వినిపించిన ప్రతిపక్ష న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని రుజువు చేస్తూ, ట్రిపుల్ టెస్ట్ కండిషన్ ఉన్నప్పటికీ రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని చెప్పారు. సాధారణ ప్రాంతాల్లో రిజర్వేషన్ పరిమితి కఠినంగా పాటించాల్సిన అవసరముందని వాదించారు.

దీంతో సుప్రీంకోర్టు హైకోర్టు స్టే కొనసాగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఈ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు తాత్కాలికంగా నిలిచిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త చట్టపరమైన వ్యూహం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News