Thursday, August 13, 2026
25.2 C
Hyderabad

యుద్ధ భూమిలో శాంతి కపోతాలు!

‘సై’నిక ఆపరేషన్ లో వ్యోమిక, ఖురే‘షీ’లు!!

న్యూ ఢిల్లీ, మే 8 (అడుగు న్యూస్‌ ప్రత్యేక ప్రతినిధి):
జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపు దాడి చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో నిర్వహించిన ఈ దాడులపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. మిస్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు కూడా మాట్లాడారు. భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక ఆపరేషన్‌పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి గురించే యావత్‌ దేశమంతా చర్చించుకుంటోంది. ఆ ఇద్దరే కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌.

ఈ ఇద్దరు మహిళా అధికారుల వివరాలు ఆసక్తిగా ఉన్నాయి. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఖురేషి సోఫియా1990లో భారత సైన్యంలో చేరారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె సిగ్నల్ కార్ప్స్ లో సేవలందిస్తున్నారు. భారత సైన్యంలో తొలి మహిళా అధికారిణి ఖురేషి సోఫియా. 2016లో నిర్వహించిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక గ్రూపులో ఆమె భారత బలగాలకు నాయకత్వం వహించారు. అందులో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. ఐక్యరాజ్యసమితి శాంతి బలగాల్లో కూడా ఆరేళ్ల పాటు సోఫియా ఖురేషి తన సేవలందించారు. 2006లో కాంగోలో జరిగిన మిషన్‌లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మీడియాలో మాట్లాడిన ఖురేషి ‘పహల్‌గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఈ ఆపరేషన్‌’ అన్నారు.

మరోవైపు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్. ‘వ్యోమిక’ పేరుకు అర్థం ‘ఆకాశంలో నివసించేది’ లేదా ‘ఆకాశం కుమార్తె’ పేరుకు తగ్గట్లుగా ఆమె వింగ్ కమాండర్ అయింది. ఆమె నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో చేరడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించి, తరువాత ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇండియన్‌ నేవీలో హెలికాప్టర్ పైలట్‌గా నియమితులయ్యారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ పొందారు.

వ్యోమిక 2,500 కంటే ఎక్కువ గంటలు విమాన ప్రయాణాన్ని నమోదు చేశారు. జమ్మూ కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలతో సహా కొన్ని కఠినమైన భూభాగాలలో ఆమె చేతక్, చీతా వంటి హెలికాప్టర్లను నడిపింది. ఆమె బహుళ రెస్క్యూ మిషన్లలో కీలక పాత్ర పోషించింది. ఆమె నాయకత్వం వహించిన ప్రధాన మిషన్లలో ఒకటి నవంబర్ 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగింది. ఈ ఆపరేషన్లు అధిక ఎత్తు, క్లిష్ట వాతావరణం, మారుమూల ప్రాంతాలలో నిర్వహించారు. వింగ్ కమాండర్ సింగ్ అధిక-ధైర్య మిషన్లలో కూడా పాల్గొన్నారు. 2021లో ఆమె 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ మణిరాంగ్‌కు ట్రై-సర్వీసెస్ ఆల్-ఉమెన్ పర్వతారోహణ యాత్రలో చేరారు. అటువంటి మిషన్లలో ఆమె పాల్గొనడం భారతదేశ రక్షణ సేవలలో నాయకత్వం, క్షేత్ర పాత్రలలో మహిళల ప్రమేయాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళల పసుపు, కుంకుమలను తుడిచేసిన ఉగ్రవాదాన్ని అణచే ఆపరేషన్ సిందూర్ ను మహిళలే ముందుండి నడపడం మహిళలకే కాదు మనందరికీ గర్వకారణం.

Latest News

బౌద్ధ మతం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో అనేక మాత శాఖలు వెలిశాయి. అలాంటివి మనకు సుమారు అరవై వరకు తెలుసు. మతాల పుట్టుకకు కారణాలు వేద కాలం తర్వాత సమాజంలో ప్రజలు నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణులు,...

నెత్తింటికెలా? నేతెంటికేలా!?|ADUGU TRENDS

కురులంటే నెత్తింటికలు. కేశాలు. ఎంట్రుకలను ఎన్కటికి కవులు కారుమబ్బులతోటి పోల్చిండ్రు. కావ్యాల్ల కలువల సమూహంతోటి పోల్చిండ్రు. ఎంట్రుకలకు పూల సుగంధాలు అద్దడం పరిపాటే. కల్పవృక్షాల పరిమళాలు దేవతల తలవెంట్రుకల నుండి వెలువడుతున్నట్లు వర్ణించడం...

డిలిమిటేషన్ – ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|EDITORIAL

2026 ఏప్రిల్‌ 16న లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లు ప్రవేశపెట్టబడింది. అధికారిక పార్లమెంటరీ రికార్డు ప్రకారం అది పెండింగ్‌లో ఉంది. ఇంత ప్రాధాన్యమైన రాజ్యాంగ సవరణను తగిన చర్చ లేకుండా ఆమోదించడమూ తప్పే. రాజకీయ...

ఆగస్టు 13, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్ష ఋతువు శ్రావణ మాసం --శుక్లపక్షం శ్రావణ మాసారంభం తిధి శు.పాడ్యమి రాత్రి 09.43 వరకు ఉపరి విదియ నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.42 వరకు ఉపరి మఖ యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.53 వరకు పరిఘ కరణం కింస్తుఘ్నం ఉదయం...

గీ అవ్వ.. భలే బాద్దరిది!?|ADUGU TRENDS

గీ అవ్వ అందరసొంటి మామూలు అవ్వ కాదు. భలే బాద్దరిది. పేరుకే ముసలిది కనీ, వయసొళ్ళు కూడా సేయలేని పనులు శేసి సూపిత్తా0ది. ఏకంగా వింగ్ వాక్ శేసి అందరి మనసులను గెలిసి0ది....

పార్లమెంటులో చివరకు మిగిలేదేంటి?!|EDITORIAL

ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నది నిజంగా ప్రజల కోసమే అయితే, వారికి ప్రయోజనం కలగాలి. విద్యార్థుల కోసమే అయితే వారి సమస్యకు పరిష్కారం రావాలి. ప్రజాస్వామ్యం కోసమే అయితే పార్లమెంట్‌ సరిగా పనిచేయాలి. ప్రజల...

ఆగస్టు 12, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య రాత్రి 11.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుష్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యతీపాత సాయంత్రం 05.28 వరకు ఉపరి వరీయాన్ కరణం చతుస్పాద మధ్యాహ్నం 12.31 వరకు ఉపరి...

జెరం గోలీలు బట్టలకేత్తండ్లు!?|ADUGU TRENDS

బట్టలు సర్ఫు, సబ్బుతోటి ఉతుకుతం. గా బట్టలుతికే మిషినిలైతే లిక్విడ్ పొత్తం. జెరం వత్తే, ఓ పారాసిటమాల్ గోలేత్తం. గీ జెరానికేసే గోలి గా బట్టలకెత్తే!? గా జెరం పోయినట్లే గా మురికి...

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు?|EDITORIAL

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు? మరెక్కడైనా ఇదే పరిస్థితి పునరావృతం కాకూడదు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని అమ్ముకునే వ్యక్తి కేవలం విద్యార్థులను మోసం చేయడం లేదు. మెరిట్‌, కష్టం, ప్రతిభపై ఉన్న...

ఆగస్టు 11, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి చతుర్దశి రాత్రి 01.32 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం పునర్వసు ఉదయం 10.19 వరకు ఉపరి పుష్యమి యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర మధ్యాహ్నం 02.43...

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News