అనారోగ్యానికి గురై నిమ్స్ దావఖాన లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ను మాజీ ఎంపీ పోతుగంటి రాములు, నాగర్ కర్నూల్ బిజెపి కంటెస్టెడ్ ఎంపీ కాండిడేట్ పోతుగంటి భారత్ ప్రసాద్ లు పరామర్శించారు. జగన్నాథం ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం జగన్నాథం కుటుంబసభ్యులు, కుమారుడు మంద శ్రీనాథ్, కుమార్తె డా. పల్లవిలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

