ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు కొత్త షరతులు విధిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లు మంజూరైన 45 రోజుల్లోనే నిర్మాణం ప్రారంభించాల్సిందే, లేనిపక్షంలో మంజూరు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈ షరతులతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో డబ్బులు ఎలా సమకూర్చుకోవాలని అసమంజస స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం మొత్తం ₹5 లక్షలు అందిస్తుందా లేదా అన్న అనుమానంతో, ముందుగా అప్పు తీసుకుని నిర్మాణం చేపట్టడం సురక్షితమా అనే భయాందోళన నెలకొంది. తీరా అప్పు చేసి ఇల్లు నిర్మించాక ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఏం చేయాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. కొత్త షరతుల వల్ల మంజూరైన ఇళ్లపైనా సంతోషంగా లేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

