Saturday, August 1, 2026
25.5 C
Hyderabad

జనవరి 11 – 2025 శనివారం

శ్రీ క్రోధినామ సంవత్సరం–దక్షిణాయనం
హేమంతఋతువు- పుష్యమాసం-శుక్లపక్షం
తిధి శు ద్వాదశి ఉదయం 07.01 వరకు
ఉపరి త్రయోదశి
నక్షత్రం రోహిణి పగలు 10.59 వరకు
ఉపరి మృగశిర
యోగం శుక్ల పగలు 12.11 వరకు ఉపరి
బ్రహ్మ
కరణం బాలవ ఉదయం 07.58 వరకు
ఉపరి కౌలవ
వర్జ్యం సాయంత్రం 04.24 నుండి 05.56
వరకు
దుర్ముహూర్తం ఉదయం 06.49 నుండి
08.15 వరకు
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.49
సూర్యాస్తమయం సాయంత్రం 05.59

జనవరి 11–2025 శనివారం
నేటి రాశి ఫలితాలు

మేషం
మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

వృషభం
చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

మిధునం
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

కర్కాటకం
వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి.

సింహం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య
పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. స్థిరస్తి వివాదాలలో శిరో బాధలు తప్పవు.

తుల
వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.

వృశ్చికం
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు
సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.

మకరం
ఉద్యోగులకు పనిఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం
నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News