అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్
కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కొత్త రేషన్ కార్డుల రూపకల్పనకు సంబంధించిన పలు డిజైన్లను సీఎంకు చూపెట్టగా పరిశీలించి తగు సూచనలు చేశారు.

