Tuesday, September 15, 2026
22.8 C
Hyderabad

ప్రపంచానికి మార్గదర్శనం పవిత్ర ఖురాన్

– శాస్త్ర సాంకేతిక రంగాల సమగ్ర భాండాగారం ఖురాన్
– మాతృభాషణలో ఖురాన్ అనువాదాన్ని చదవాలి
– మౌలానా ఖాజి హఫీజ్ అల్షా అమీర్ శర్ఫీ

పవిత్ర ఖురాన్ ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని, శాస్త్ర సాంకేతిక రంగాల భాండాగారం ఖురాన్ అని జామే నిజామియ అరబీ యూనివర్సిటీ మౌలానా ఖాజి హఫీజ్ అల్షా అమీర్ శర్ఫీ అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మదరస ఇస్లామియా ఫజల్ -ఉల్- ఉలూమ్ అరబీ పాఠశాల 30వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆధ్యాత్మిక బోధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారం పవిత్ర ఖురాన్ లో ఉంది అన్నారు. నేడు ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అందరూ ఖురాన్ లో ఉన్న అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తూ విజయం సాధిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ మాతృ భాషలలో అనువదించబడిన పవిత్ర ఖురాన్ ను విధిగా చదవాలని పిలుపునిచ్చారు. భూమి మీద నివసించే ప్రతి ప్రాణి గురించి ఖురాన్ లో ఉంది అన్నారు. సర్వ మానవాళికి అవసరమైన సమాచారంతోపాటు మనిషి నడవడిక ఎలా ఉండాలి అన్నది అందులో పొందుపరచడం జరిగిందన్నారు. ఇస్లాం ధర్మంలో ఖురాన్ ను అనుసరించి ముందుకు సాగిన వారు అల్లా కృపతో అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. తమ పిల్లలను మదర్సాలలో చేర్పించి ఖురాన్ కంఠస్థం చేపించి హఫీజ్ లు గా ఆలీం లు గా ఎదిగే విధంగా చేయాలన్నారు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో అల్లాను ప్రార్థించి ముందుకు పోయినట్లయితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్నారు. అల్లా ఈ భూమి మీద ఉన్న ప్రాణికోటి కంటే మానవుడికి ఆశ్రాఫుల్ మౌమిన్ గా పుట్టించాడన్నారు. పశుపక్షాదులకు ఒక జీవన విధానం ఇస్తే మానవుడికి మేధస్సుతోపాటు సమాజంలో నడవడిక ఎలా ఉండాలన్న ఆలోచనతో మనిషిని పుట్టించాడని ఆయన అభివర్ణించారు. మదరస ఇస్లామియా ఫజల్ ఉల్ ఉలూం స్థాపించి 30 ఏళ్లు పూర్తి చేసుకుని వార్షికోత్సవం జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఇప్పటివరకు 86 మంది హఫీజ్ లను తీర్చి దిద్దరని, మరో ఇద్దరు ఆలిం కోర్స్ పరీక్షలు రాయడం ఈ పాఠశాలలో చదివిన పిల్లలు అందరూ సమ సమాజ స్థాపన కోసం ఇస్లాం ధర్మ పరిరక్షణ కోసం తద్వారా వీరి కోసం శ్రమపడిన ప్రతి ఒక్కరికి అల్లా కృప ప్రధానంగా వీరి తల్లిదండ్రులకు స్వర్గలోక ప్రాప్తి కలగడానికి హఫీజ్ లు బాటలు వేస్తారని ఆయన వివరించారు.ఈ పాఠశాలల స్థాపించిన ఫౌండర్ సభ్యులను ఆయన పేరుపేరునా గుర్తుచేస్తూ వారి సేవలను కొనియాడుతూ వారికోసం ప్రత్యేక ప్రార్థన చేశారు. ప్రస్తుతం పాఠశాలను నడిపిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ అరబ్బీ పాఠశాల ను మరింత అభివృద్ధి చేసే విధంగా కమిటీ ముందుకు సాగాలని అందుకు అల్లా పూర్తి మద్దతు ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. ఖురాన్ కంఠస్థం చేసిన హఫీజ్ లను ఆయన అభినందించారు. పాఠశాల వార్షికోత్సవం అబ్దుల్లా ఖాన్ అధ్యక్షతన పాఠశాల ప్రధాన కార్యదర్శి సయ్యద్ రఫీయోద్దీన్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషా విరత్ కమిటీ ఉపాధ్యక్షుడు, మీలాద్ కమిటీ అధ్యక్షుడు షేక్ యాకుబ్ బావజీర్,హఫీజ్ మొహమ్మద్ ఇర్షాద్ ఆలం,కమిటీ సభ్యులు ముస్తాఖ్ అహ్మద్,అబ్దుల్ అలీం,మహమ్మద్ యూసుఫ్,సయ్యద్ అహ్మద్,ఇస్మాయిల్ ఖాన్,మహమ్మద్ ఖాజా, అరిఫ్ హుస్సేన్,సమద్,మునవ్వర్, తాహేర్ లతో పాటు విద్యార్థుల తల్లి దండ్రులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News