అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో వాలంటైన్స్ డే రోజున దారుణ ఘటన జరిగింది. గౌతమి అనే యువతిపై గణేష్ అనే యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో కోపోద్రిక్తుడైన నిందితుడు కత్తితో తలపై పొడిచి, అనంతరం మొహంపై యాసిడ్ పోశాడు. గాయపడిన గౌతమిని తక్షణమే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత ద్వేషంతో ఈ దాడికి పాల్పడిన గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

