Friday, September 18, 2026
26.4 C
Hyderabad

కార్మికుల పక్షమా? కాసం పక్షమా?

అన్ని జెండాలది ఒకటే ఎజెండా!

కార్మిక భవనం ‘కీ‘లకంగా కార్పొరేషన్ సమావేశం

వరంగల్ బల్దియా ఎదుట అజంజాహి కార్మికుల నిరసన

కార్మిక భవన్ కూల్చిన వారిపై కఠిన చర్యలకు ఎమ్మెల్సీ సారయ్య పట్టు

రూ.10 కోట్లతో కార్మిక భవన్ కట్టాలని మంత్రి సురేఖకు కార్మికుల వినతి

అజం జాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జాదారులు ఎవరి బలంతో హైకోర్టుకు వెళ్లారు? కబ్జాల కాసం యాజమాన్యాన్ని నిలువరించే శక్తి ఏ ‘కొండ’కు, ఏ ‘ బండ ‘ కు, ఏ ‘గుండు’ కు లేదా? కావాలనే అక్రమ నిర్మాణానికి అంతా మద్దతిస్తున్నారా? అసలు మీరు కార్మికుల పక్షమా? కాసం పక్షమా? అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. మొత్తం వరంగల్ మహా నగరానికి ప్రాతినిధ్యం వహించే అన్ని పార్టీల కార్పోరేటర్ల, ప్రజాప్రతినిధులతో మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా బల్దియా సర్వ సభ్య సమావేశం జరిగితే, అందులో అంతా ఏకతాటిపై నిలిచారు. అన్ని పార్టీలు తమ జండాలను మరిచి ఒకే జెండా కిందకు వచ్చారు అదే అజం జాహి మిల్లు కార్మిక భవన స్థల కబ్జా వివాదం. ఇక ఇప్పుడు నాయకులు ఎవరి పక్షమో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది.

వరంగల్ మహా నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం అజంజాహి కార్మిక భవనం చుట్టూనే తిరిగింది. లోపలా, బయటా అంతా అదే చర్చగా, రచ్చ రచ్చగా సాగింది. కార్మికులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతిందులు అంతా అదే అంశంపై అల్లరి అల్లరి చేశారు.

బయట కార్మికుల కలకలం


కార్పొరేషన్ సమావేశం ప్రారంభం కానున్న కొద్దిసేపటి ముందే బల్దియా కార్యాలయానికి పెద్ద ఎత్తున అజంజాహి కార్మికులు చేరుకొని నిరసనకు దిగారు. ఫ్లెక్సీలు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నినాదాలతో నిరసన తెలిపారు. కాసం పుల్లయ్య డౌన్ డౌన్.. ! కాసం నమశ్శివాయ డౌన్ డౌన్ !! అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు ఇనుముల శ్రీనివాస్, గంగుల దయాకర్ మాట్లాడారు. కార్మిక భవనాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకొని సొంత డబ్బులతో కార్మిక భవన్ కట్టిస్తానని గత నెలలో విలేకరుల సమావేశంలో మాటిచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు నెల రోజులు గడిచినా, ఇప్పటి వరకు పెదవి విప్పలేదని, పత్తా లేకుండా పోయారని కార్మికులు ఆరోపించారు. కొండా మురళి మద్దతు లేకుండానే కాసం నమశివాయ హైకోర్టుకు వెళ్లారా? కాసం యాజమాన్యాన్ని నిలువరించే శక్తి కొండా మురళికి లేదా? కావాలనే అక్రమ నిర్మాణానికి కొండా దంపతులు మద్దతిస్తున్నారా? అని ప్రశ్నించారు. కొండా దంపతులు కార్మికుల పక్షమా? కాసం పక్షమా? తేల్చుకోవాలన్నారు.

లోపల వాడివేడిగా…


మరోవైపు కార్పొరేషన్ ప్రధాన ద్వారం బయట కార్మికుల ఆందోళనల మధ్య సమావేశ మందిరం లోపల ప్రారంభమైన సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కార్మిక భవన్ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని, కాసం కాంప్లెక్స్ కు అనుమతులు ఇచ్చిన అధికారులపై వేటువేయాలని డిమాండ్ చేశారు. గత ఎమ్మెల్యే అజంజాహి కార్మిక భవనం అమ్మితే, అందుకు కొందరు కార్పొరేషన్ అధికారులు సహకరించారని ఆరోపించారు. తప్పుడు దస్తావేజులతో, నిబంధనలను తుంగలో తొక్కి కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని సారయ్య మండిపడ్డారు. వెంటనే కాసం కాంప్లెక్స్ కి ఇచ్చిన అనుమతులు రద్దుచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరును రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అన్ని పార్టీలు మద్దతు తెలపడం విశేషం.

కబ్జాదారులపై నిప్పులు చెరిగిన సారయ్య


కౌన్సిల్ సమావేశం నుంచి బయటికి వచ్చిన మాజీ మంత్రి సారయ్య మీడియా సమావేశంలోనూ కార్మిక భవన్ కబ్జాదారులపై నిప్పులు చెరిగారు. కొందరు కబ్జాలు చేసిన పని వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ధ్వజమెత్తారు. కబ్జాదారులను వదిలిపెట్టేది లేదని కార్మిక భవన్ కట్టించే వరకు విశ్రమించేది లేదన్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కార్మిక భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మంత్రి సురేఖకు వినతిపత్రం


అజం జాహి కార్మిక భవనాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, కార్మిక భవన్ ను కూల్చిన వారిని అరెస్టు చేయాలని కార్పొరేషన్ సమావేశానికి హాజరైన మంత్రి కొండా సురేఖకు అజం జాహీ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. రూ 10 కోట్లతో కార్మిక భవన్ కూల్చిన చోట అన్ని హంగులతో కొత్త కార్మిక భవనం నిర్మించాలని వినతి పత్రంలో కోరారు.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News