RAITHU NESTHAM| రైతు నేస్తం సభలో DEPUTY CM| డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ, 9 DAYS| తొమ్మిది రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా మొత్తం నిధులు జమ చేస్తామని ప్రకటించారు. రైతు పండించే ప్రతి ఎకరాకు భరోసా అందిస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం FARMING| వ్యవసాయానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయంతో విడదీయరాని బంధం ఉందని, గత పదేళ్ల BRS| టీఆర్ఎస్ పాలనలో పంట నష్టాలపై ఎలాంటి స్పందన లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంట నష్టాలకు రూ.260 కోట్లు విడుదల చేయడంతో పాటు రైతుల ఇన్సూరెన్స్‌కు రూ.2,181 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని 29 లక్షల పంపుసెట్లకు ఉచితంగా 24 గంటల కరెంట్ అందించేందుకు రూ.16,691 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి కోసం ఇప్పటికే రూ.11 వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. దయ్యాలు విక అట్టహాసం చేస్తున్నాయని, అటువంటి తప్పుడు ప్రచారాలను ఊరి పొలిమేరలకే తరిమివేయాలని పిలుపునిచ్చారు.

