శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం కృష్ణపక్షం
తిధి బ చతుర్దశి ఉదయం 08.45 వరకు
ఉపరి అమావాస్య
నక్షత్రం ధనిష్ఠ సాయంత్రం 04.35 వరకు
ఉపరి శతభిష
యోగం శివ రాత్రి 02.35 వరకు ఉపరి
సిద్ద
కరణం శకుని ఉదయం 07.30 వరకు
ఉపరి నాగవ
వర్జ్యం రాత్రి 11.21 నుండి12.52 వరకు
దుర్ముహూర్తం ఉదయం 10.00 నుండి
10.48 వరకు తిరిగి పగలు 02.48 నుండి
03.36 వరకు
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.40
సూర్యాస్తమయం సాయంత్రం 06.05
ఫిబ్రవరి 27 గురువారం 2025
రాశి ఫలితాలు
మేష
ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.
వృషభ
ఉద్యోగంలో బాధ్యతల మార్పు వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మిథున
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని పొందుతారు. ఆర్థిక లాభాలు సాధ్యపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.
కర్కాటక
ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ముఖ్యమైన పనుల్లో శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది.
సింహ
రోజంతా సాఫీగా, ఆనందంగా గడుస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
కన్యా
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల
ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలమవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.
వృశ్చిక
ప్రతి పనిలోనూ కొంత వ్యయ ప్రయాసలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
ధనుస్సు
ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.
మకర
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభ
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు కష్టంతో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.
మీన
ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

