భారత ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. 70 స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. జనవరి 10న నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన జనవరి 18న, ఉపసంహరణ గడువు జనవరి 20గా నిర్ణయించారు. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 83.49 లక్షల మంది పురుషులు, 71.74 లక్షల మంది మహిళలు ఉన్నారు. 13,033 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ వ్యవధి ఫిబ్రవరి 23తో ముగియనుంది.

