Wednesday, September 23, 2026
22.5 C
Hyderabad

పట్టణ ఫలితాలు.. పార్టీలకు గుణపాఠాలు!|EDITORIAL

ఫలితాలు వెలువడడానికి ముందు రోజు ఢిల్లీ నుండి పదిన్నరేళ్ళు నేనే సీఎం అనడం రెట్టింపైన ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఒక నాయకుడు వరుస విజయాలు సాధిస్తే అది ఆయనలోనేగాక, శ్రేణుల్లోనూ విశ్వాసాన్ని పెంచుతుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్‌లో కనిపిస్తున్నది. అయితే విజయం ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రజల అంచనాలు పెరుగుతాయి. వాటిని నెరవేర్చడంలో సఫలమైనంత వరకే విజయాలు వరిస్తూ ఉంటాయి. పరిపాలన సాఫల్యాలే ఎన్నికల విజయాలు. స్థిరమైన పరిపాలన, పురోగతి మాత్రమే అధికారాన్ని సుస్థిరం చేస్తుంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణ రాజకీయాల్లో పట్టణ ఎన్నికల ఫలితాలు కొత్త సమీకరణాలను తెరమీదకు తెస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ వాతావరణం కేవలం తాత్కాలికమా? లేక శాశ్వత మార్పులకు అంకురార్పణా? అన్న ప్రశ్నకు ఈ ఫలితాలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణుల్లో పట్టు బిగించిన కాంగ్రెస్, పట్టణ ఓటర్లలో తన పట్టు నిలబెట్టుకోవడం రాజకీయంగా కీలక పరిణామం.

2023 అసెంబ్లీ ఎన్నికల విజయంతో ప్రారంభమైన కాంగ్రెస్ విజయ పరంపర, లోక్‌సభ ఎన్నికలు, ఉపఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు దాటి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వరకు విస్తరించడం యాదృచ్ఛికమేమీ కాదు. ఇది ఓటర్లలో చోటుచేసుకుంటున్న మానసిక మార్పునకు సూచిక. పట్టణ ఓటరు సాధారణంగా అభివృద్ధి, మౌలిక వసతులు, పారదర్శక పాలన వంటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు. ఈ భావనను సరిగ్గా అర్థం చేసుకున్న కాంగ్రెస్, ప్రచారంలో అభివృద్ధి అజెండాను ముందుకు తెచ్చింది. “అధికార పార్టీకి పట్టం కడితేనే అభివృద్ధి సాధ్యం” అన్న సందేశాన్ని బలంగా నాటడంలో విజయం సాధించింది.

ఇక బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. దాదాపు పదేళ్ల పాలన తర్వాత ఎదురైన ఓటమి నుంచి పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. తొడకొడుతూ, రొమ్ము విరుస్తూ, విర్రవీగుతూ, బస్తీమే సవాల్! అంటూన్న ఆ పార్టీ కారు బస్తీల్లోనూ బోల్తా కొట్టింది. కాలుదువ్వుతున్న కారు పార్టీ ఇంకా కోలుకోలేదనేది స్పష్టమవుతోంది. మాజీ సీఎం చంద్రశేఖర్ రావు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం, కేటీఆర్, హరీశ్ రావుల పర్యటనలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపినా, ఫలితాలు రాకపోవడం ఆలోచించాల్సిందే. ఆ పార్టీని నడిపిన కుటుంబంపై అవినీతి ఆరోపణలు, అప్పుల భారం, నేతల ఆస్తుల పెరుగుదల వంటి మచ్చలు మాసిపోలేదు. చర్చలు ఆగిపోలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమవడం ఆశ్చర్యమేమీ కాదు. రాజకీయాల్లో ఇమేజ్ కీలకం. ఒకసారి దెబ్బతింటే దాన్ని తిరిగి పొందడం కష్టం.

బీజేపీ కొన్ని కార్పొరేషన్లలో ఆధిక్యం ప్రదర్శించినా అది రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని చెప్పడానికి సరిపోదు. కరీంనగర్, నిజామాబాద్ ల్లో కనిపించిన ప్రభావం స్థానిక నేతల వ్యక్తిగత బలమే. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ వంటి నేతల కృషి అక్కడ ప్రతిఫలించినట్లు కనిపిస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా బలమైన పునాదులు వేయాలంటే కేవలం విమర్శలకే పరిమితమవకుండా, అభివృద్ధి కార్యాచరణపై స్పష్టమైన దృష్టి, ప్రణాళిక అవసరం. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి కనీస నిధులు తెచ్చి, మౌలిక వసతుల అభివృద్ధి చేయగలిగితేనే పార్టీకి దీర్ఘకాలంలోనైనా మనుగుడ ఉంటుంది.

ఈ ఎన్నికలలో మరో ఆసక్తికర పరిణామం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ అడుగులు. కుటుంబ రాజకీయాలనుంచి దూరమవుతూ ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేసి గద్వాల జిల్లా వడ్డేపల్లిలో విజయం సాధించడం ఆమెకు రాజకీయంగా ఊతమిచ్చే పరిణామం. కొత్త రాజకీయ వేదిక కోసం ప్రయత్నిస్తున్న ఆమెకు ఇది ప్రాథమిక విజయమే. అయితే ఈ విజయంపై వివాదాలు వచ్చాయి. ఈ విజయాన్ని విస్తృత స్థాయికి తీసుకెళ్ళడంపైనే ఆమె రాజకీయ భవితవ్యం ఆదారపడి ఉంది.

పట్టణ ఓటర్ల ఆలోచన గ్రామీణ ఓటర్లకన్నా భిన్నంగా ఉంటుంది. డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి స్థానిక సమస్యలను కాంగ్రెస్ ప్రచారం చేయడం కలిసివచ్చింది. మంత్రులకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించడం, ఎన్నికల యంత్రాంగాన్ని క్రమబద్ధంగా నడపడం, నిరంతర పర్యవేక్షణ చేయడం వంటి వ్యూహాలు ఫలితాలపై ప్రభావం చూపాయి.

ఈ ఫలితాలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరుస్తున్నాయి. పార్టీలో అంతర్గతంగా ఆయన ఆధిపత్యం పెరుగుతుంది. అందుకే ఆయన ఫలితాలు వెలువడడానికి ముందు రోజు ఢిల్లీ నుండి పదిన్నరేళ్ళు నేనే సీఎం అనడం రెట్టింపైన ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఒక నాయకుడు వరుస విజయాలు సాధిస్తే అది ఆయనలోనేగాక, శ్రేణుల్లోనూ విశ్వాసాన్ని పెంచుతుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్‌లో కనిపిస్తున్నది. అయితే విజయం ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రజల అంచనాలు పెరుగుతాయి. వాటిని నెరవేర్చడంలో సఫలమైనంత వరకే విజయాలు వరిస్తూ ఉంటాయి. పరిపాలన సాఫల్యాలే ఎన్నికల విజయాలు. స్థిరమైన పరిపాలన, పురోగతి మాత్రమే అధికారాన్ని సుస్థిరం చేస్తుంది.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News