Wednesday, November 11, 2026
24.7 C
Hyderabad

మా దారులు వేర్వేరు|SONIA GANDHI|LIFE HISTORY|CONGRESS

మోదీ నేరుగా కళ్ళల్లోకి చూసి మాట్లాడరు
మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం
ఆనాడు ఒత్తిడితోనే ఒప్పుకున్నా..
వ్యతిరేకించిన రాహుల్, ప్రియాంక
ఆ తర్వాత మన్మోహన్ ను ప్రతిపాదించా
పీవీ రాజనీతిజ్ఞుడు.. ఆయనతో శత్రుత్వం లేదు
రాజీవ్ హత్య కేసు దర్యాప్తుపైనే విభేదాలు
ఆనాడు ప్రణబ్ ప్రధాని కావాలనుకున్నారు
యూపీఏ ప్రభుత్వంలో జోక్యం చేసుకోలేదు
అత్తమ్మ కోపం చూసి వణికిపోయా..
ఇందిర సమక్షంలోనే మేనక అసభ్యపదజాలం
ఆమె వల్లే రాజీవ్-సంజయ్ ల మధ్య విభేదాలు
రాహుల్ కన్నా ముందు బాబు పుట్టిపోయాడు
రెండుసార్లు క్యాన్సర్ ను జయించా
రియాల్టీ షోలా సంజయ్- మేనకలు
బిలాంగింగ్- ఏ జర్నీ ఆఫ్ లవ్ పస్తకం
ఆత్మకథలో సోనియా సంచలన విషయాలు

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన ఆత్మకథ ‘ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, రాజకీయ ప్రయాణానికి సంబంధించిన పలు సంచలన విషయాలను తొలిసారిగా బహిర్గతం చేశారు. 2010లో తనకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు సోనియా వెల్లడించారు. మీడియా దృష్టి నుంచి తప్పించుకుని వ్యక్తిగత గోప్యతను కాపాడుకునేందుకు ఇటలీలోని మిలాన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నానని వెల్లడించారు. మొదటి శస్త్రచికిత్స జరిగిన ఏడాదికే ప్యాంక్రియాస్‌లో మరో గడ్డను గుర్తించడంతో, నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో రెండో ఆపరేషన్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు.

2004లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని ఎందుకు చేపట్టలేదు? అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ ప్రశ్నకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఇప్పుడు తన ఆత్మకథ ద్వారా సమాధానమిచ్చారు. తన కొత్త పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ’లో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం వెనుక ఉన్న వ్యక్తిగత, రాజకీయ కారణాలను వెల్లడించారు. నవంబర్ 10న విడుదల అయిన ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. 2004 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో ఈ విషయంపై చర్చించినట్లు సోనియా వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ప్రధానమంత్రి పదవి చేపట్టాలా? అని వారిని అడిగినప్పుడు ఇద్దరూ స్పష్టంగా వద్దని చెప్పారని రాశారు. ఇందిరా గాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్యను ప్రత్యక్షంగా చూసిన తమకు, తల్లి కూడా ప్రధానమంత్రి అయితే కుటుంబానికి ముప్పు పెరుగుతుందనే భయం ఉండేదని ఆమె వివరించారు. తాను ప్రధాని కావడం లేదని చెప్పినప్పుడు పిల్లలు ఎంతో ఉపశమనం పొందారని గుర్తుచేసుకున్నారు. 2004 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధానమంత్రి పదవిని స్వీకరించాలా? వద్దా? అనే విషయంలో తాను తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యానని సోనియా గాంధీ రాశారు. ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తల ఆశలు, ప్రజల నమ్మకం, మరోవైపు తన వ్యక్తిగత భయాలు, కుటుంబ భద్రత వంటి అంశాలు తనను ఆలోచనలో పడేశాయని తెలిపారు. చివరకు ప్రధానమంత్రి పదవిని తిరస్కరించాలని నిర్ణయించుకున్న రాత్రి తన మనసులోని సందేహాలన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. తన అంతరాత్మ నుంచి ‘సోనియా.. నీకు నువ్వు నిజాయితీగా ఉండు. ఈ విషయం నీకు ఎప్పటినుంచో తెలుసు. దాన్ని వదిలేయ్!’ అనే భావన కలిగిందని పుస్తకంలో వివరించారు. తన నివాసంలో కాంగ్రెస్, సంకీర్ణ పార్టీల నేతలు ప్రధానమంత్రి పదవిని స్వీకరించాలని కోరిన సమావేశాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ తనను ‘మీరు ప్రధానమంత్రి కావడానికి ఎందుకు అంగీకరించారు?’ అని ప్రశ్నించారని తెలిపారు. నాయకులు తన మాట వినడం లేదని, ఒత్తిడి చేస్తున్నారని తాను సమాధానమిచ్చినట్లు రాశారు. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారని, ఆ సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారని వెల్లడించారు.తాను ప్రధానమంత్రి అయితే బీజేపీ, దాని మిత్రపక్షాలు తన విదేశీ మూలాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని సోనియా భావించారు. దీనివల్ల దేశంలో రాజకీయ వివాదం పెరిగి, ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందారు. తనకు ప్రధానమంత్రి పదవి కంటే దేశంలో స్థిరమైన, సమర్థవంతమైన, లౌకిక ప్రభుత్వం ఏర్పడటమే ముఖ్యమని పేర్కొన్నారు. 2004లో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ నేతల సమావేశంలో తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టబోనని ప్రకటించినప్పుడు పలువురు నాయకులు నిరసన వ్యక్తం చేశారని సోనియా గుర్తుచేసుకున్నారు. కొందరు నిర్ణయం మార్చుకోవాలని కోరడంతో కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అనంతరం డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. దీంతో యూపీఏ ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ నాయకత్వం వహించారు.మొత్తంగా, ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం వెనుక కుటుంబ భద్రత, రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగత సిద్ధాంతాలు కీలకంగా ఉన్నాయని సోనియా గాంధీ తన ఆత్మకథలో వివరించారు. 2004లో దేశ రాజకీయాలను మలుపు తిప్పిన తన నిర్ణయంపై ఇన్నేళ్ల తర్వాత ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీవితానికి సంబంధించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ’ పుస్తకం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన అనేక కీలక విషయాలను సోనియా గాంధీ వెల్లడించారు. ఆమె వ్యక్తిగత జీవితం, ప్రేమ, కుటుంబం, రాజకీయ ప్రయాణం, భారతదేశంతో అనుబంధం వంటి అనేక అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా అలాంటి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో అధికారాల విషయంలో ఎలాంటి గందరగోళం లేదని సోనియా గాంధీ వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించగా, తాను కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించానని ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ’ పుస్తకంలో పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకున్నానని, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రభుత్వ ఫైళ్లను తెప్పించుకున్నానని గతంలో వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు సమయంలో తాను కొన్ని సూచనలు ఇచ్చినట్లు అంగీకరించారు. అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు తగిన గుర్తింపు కల్పించాలన్నదే తన ఉద్దేశమని సోనియా వివరించారు.

మరోవైపు, 2004 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. ఈ నిర్ణయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కీలక పాత్ర పోషించారని, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ప్రధాని పదవిని స్వీకరించవద్దని వారు సూచించారని తెలిపారు. 1991 ఆర్థిక సంస్కరణలకు నాయకత్వం వహించిన మన్మోహన్ సింగ్ అనుభవం యూపీఏ ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని భావించి ఆయనను ప్రధానిగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, 2010లో ప్రధానమంత్రి మార్పు అంశాన్ని ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించారని, ఆయనకు ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష ఉందని తాను అర్థం చేసుకున్నానని సోనియా తన పుస్తకంలో వెల్లడించారు. కాగా, యూపీఏ పదేళ్ల పాలనలో తన పాత్రపై వచ్చిన విమర్శలకు ఈ పుస్తకం ద్వారా సోనియా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 984లో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో జరిగిన విధ్వంసాన్ని చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీవ్రంగా కలత చెందారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. సోనియా వ్యాఖ్యలపై శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా స్పందించింది. సిక్కుల బాధను అర్థం చేసుకోవాలంటే బాధిత కుటుంబాలను కలవాలని కాంగ్రెస్ నాయకత్వానికి సూచించింది. సోనియా గాంధీ తన కొత్త పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలకు ముందు బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన’ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆపరేషన్ బ్లూస్టార్ గురించి ప్రస్తావించారు ఆపరేషన్ బ్లూస్టార్ అనంతరం గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన చిత్రాలను తన అత్త, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి చూపించారని సోనియా తెలిపారు. వాటిని చూసినప్పుడు ఇందిరాగాంధీ కళ్ల నుంచి కన్నీళ్లు వచ్చాయని వెల్లడించారు. ఆపరేషన్ అనంతరం ఇందిరాగాంధీకి ప్రాణహాని బెదిరింపులు వచ్చినట్లు కూడా సోనియా చెప్పారు. తనకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఏం చేయాలనే విషయాన్ని ఆమె ముందుగానే వివరించారని తెలిపారు. ధైర్యంగా ఉండాలని, ఏడవకూడదని రాహుల్ గాంధీకి చెప్పినట్లు సోనియా గుర్తుచేసుకున్నారు సోనియా వ్యాఖ్యలపై శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి అర్ష్‌దీప్ సింగ్ క్లేర్ తీవ్రంగా స్పందించారు. ఆపరేషన్ బ్లూస్టార్ అనేది సిక్కు సమాజంపై, సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక పీఠమైన శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్‌పై జరిగిన ప్రత్యక్ష దాడి అని వ్యాఖ్యానించారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ వల్ల సిక్కులకు జరిగిన నష్టాన్ని మాటల్లో వివరించలేమని అన్నారు. ఆ అల్లర్లలో అమాయకులు హత్యకు గురయ్యారని, అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయని ఆరోపించారు. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి, వారి కష్టాలను తెలుసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వానికి సూచించారు.

Latest News

సర్కారు కొలువులు..|GOVERNMENT JOBS|AP|

720 గ్రూప్‌-2 పోస్టులు! డిసెంబరు 11 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 21న ప్రిలిమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేస్తూ యువతలో ఆశలు చిగురింపజేస్తోంది....

గా దేవునికి పన్నెండొందల రకాల నైవేద్యాలు!?|ADUGU TRENDS

పతి రోజూ దేవుడికి నైవేద్యం పెడ్తరని తెలుసు. కానీ ఎన్ని రకాల వైవేద్యాలు పెడ్తరు? భక్తుల శక్తి కొద్ది, శేతనైనంతల, ఆచారం, పండుగలను బట్టి ఒకటో, మూడో, ఐదో రకాలు పెడ్తరు. పండ్లు,...

డెమొక్రాట్లకు పునరుజ్జీవం!|EDITORIAL

అమెరికా మధ్యంతర ఎన్నికలు అగ్రరాజ్య రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ట్రంప్ దూకుడుకు ఓటర్లు బ్రేక్ వేయగా, డెమొక్రాట్లకు పట్టం కట్టారు. మారిన ఈ రాజకీయ సమీకరణాలు అమెరికా భవిష్యత్తుతోపాటు ప్రపంచ దౌత్యంపై...

నవంబర్ 11, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం తిధి శు.విదియ పగలు 01.30 వరకు ఉపరి తదియ నక్షత్రం అనురాధ ఉదయం 10.31 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం అతిగండ రాత్రి తెల్ల 03.25 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ పగలు...

జత కోసం పులి వ్యథ!|ADUGU TRENDS

గీ పులి మాములిది కాదుల్లో! మహా మాయలాడి! ఆడ శివంగి అనుకోండ్రి. గీ ఆడ పులి సావాసం, సాహసం సూత్తె ముక్కు మీద యేలేసుకుంటరు. ఔరా! అనుకుంటరు. అవ్ మల్లా! గీ పులి పేరు...

ఉన్నత విద్యా నియామకాల్లో కొత్త చిక్కులు!|EDITORIAL

ఏళ్ల తరబడి చదివి, పరిశోధనలు చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై జీవో 31 నిబంధనలు నీళ్లు చల్లుతున్నాయా? అకడమిక్‌ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కక, ఇంటర్వ్యూలే కీలకమైతే నియామకాల పారదర్శకతపై...

నవంబర్ 10, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం కార్తీక స్నానారంభం తిధి శు పాడ్యమి పగలు 12.00 వరకు ఉపరి విదియ నక్షత్రం విశాఖ ఉదయం 08.30 వరకు ఉపరి అనురాధ యోగం శోభ రాత్రి తెల్ల 03.12 వరకు ఉపరి అతిగండ కరణం...

నవంబర్ 09, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం ఆకాశ దీపారంభం తిధి అమావాస్య ఉదయం 10.50 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి ఉదయం 07.00 వరకు ఉపరి విశాఖ యోగం సౌభాగ్య రాత్రి తెల్ల 03.14 వరకు ఉపరి శోభ కరణం నాగవ ఉదయం...

మధ్యయుగంలో దక్షిణ భారతదేశం|ADUGU DIGITAL MEDIA|EDUCATION|COMPITITIVE EXAMS|SPECIAL

తొలి మధ్యయుగ కాలంలో ఉత్తర భారత దేశాన్ని రాజపుత్ర రాజ్యాలు (ప్రతిహరులు, పరమారులు, సోలంకులు, చందేలులు, చౌహాన్లు, గహద్వాలులు) పాలించారు. క్రీ.శ 8 వ శతాబ్దం తర్వాత మూడు గొప్ప రాజ్యాలు దక్షిణ భారతదేశ...

శతవసంతంలోకి స్ఫూర్తి ప్రదాత ఆడ్వాణీ|LK ADVANI|NARENDRA MODI

లాల్‌కృష్ణ ఆడ్వాణీ... భారత రాజకీయాల్లో ఆయనది తిరుగులేని ముద్ర. చెరగని చరిత్ర. ఈ నవంబరు 8న, దీపావళి పండుగతో ఆయన వందేండ్లు పూర్తి చేసుకుంటున్నారు. సంపూర్ణాయుష్షును, ఆరోగ్యాన్ని పొందిన ఆయనపై భారత ప్రధాని...

మిఠాయిల కొవ్వొత్తులు!?|ADUGU TRENDS

మిఠాయిలంటే నోరూరంది ఎవ్వలికి సెప్పండ్రి? శెక్కెర రోగమున్నోల్లైనా శెవి కోసుకుంటరు. గా మిఠాయిలు తినాల్ననే మనిసి బలహీనతని గామె ఓ ట్రెండ్ గ మార్సింది. ఏం శేసిందో సూడుండ్రి. గీమె పేరు కృతిక వీరకణ్ణన్....

ఇరాన్‌పై మళ్ళీ యుద్ధం!|EDITORIAL

యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. అమెరికా హెచ్చరికలతో ఇరాన్‌లో కలవరం మొదలైంది. అణు కేంద్రాల వద్ద అయోడిన్ మాత్రల పంపిణీ యుద్ధ భయాలకు అద్దం పడుతోంది. ప్రపంచ శాంతికి దౌత్యమే ఏకైక మార్గం. మార్గం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News